Site icon HashtagU Telugu

Bigg Boss 7 : పల్లవి ప్రశాంత్ గెలుపు బాటలు వేసింది అమరే.. ఎలాగో తెలుసా..?

Bigg Boss 7 Amardeep Is The Reason For Pallavi Prashanth Title Winner

Bigg Boss 7 Amardeep Is The Reason For Pallavi Prashanth Title Winner

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. విజేతగా నిలిచేందుకు అతను పడిన కష్టం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ లోకి ఎలాగైనా వెళ్లాలనే అతని దృడ సంకల్పం ఆ ఛాన్స్ వచ్చిన తర్వాత అక్కడ తను టాస్కులు ఆడిన తీరు ఈరోజు అతన్ని విజేతగా నిలబెట్టింది. అయితే పల్లవి ప్రశాంత్ విజయం లో ఇద్దరు కంటెస్టెంట్ ఎక్కువ పాత్ర పోశించారని చెప్పొచ్చు. అందులో ఒకరు పాజిటివ్ కాగా మరొకరు నెగిటివ్ గా ప్రశాంత్ ఆటకి సపోర్ట్ అయ్యారు.

మొదటి వారం నుంచి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ అతని మైలేజ్ పెంచే ప్రయత్నం చేశాడు అమర్ దీప్. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఉన్న అమర్ దీప్ కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ అది కూడా రైతు బిడ్డ అనే సెంటిమెంట్ తో వచ్చిన అతన్ని టార్గెట్ చేయడంతో బిగ్ బాస్ ఆడియన్స్ అంతా అతని పక్షాన నిలిచారు. ప్రతి వారం, ప్రతి టాస్క్ ఇలా అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ నే టార్గెట్ చేయడం ప్రశాంత్ ని ఆడియన్స్ కి దగ్గరయ్యేలా చేసింది.

Also Read : Bigg Boss 7 Telugu Winner : పల్లవి ప్రశాంత్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా..?

ఏదో కామన్ మ్యాన్ కేటగిరిలో వచ్చాడు. తన పనేదో తను చేసుకుంటూ వెళ్తాడులే అని అతన్ని లైట్ తీసుకుంటే పల్లవి ప్రశాంత్ కి ఇంత ఇమేజ్ వచ్చేది కాదు. కానీ అమర్ దీప్ టార్గెట్.. అతన్ని అడ్డుకుంటూ శివాజి పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయడం ప్రశాంత్ గెలుపుకి బాటలు వేసేలా చేసింది. పల్లవి ప్రశాంత్ గెలుపులో శివాజి పాత్ర ఏంటన్నది షో చూసిన అందరికీ తెలిసిందే.

సో అలా మొత్తానికి వీళ్ల ఫోకస్ చేయడం వల్ల దాన్ని తనకు పాజిటివ్ గా తీసుకుని షోలో తన సత్తా చాటి టైటిల్ విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్. ఈ సీజన్ ప్రశాంత్ విన్నర్ అవ్వడం ట్రూ జస్టిఫికేషన్ అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ కాగలడు అని ప్రూవ్ చేశాడు పల్లవి ప్రశాంత్.

We’re now on WhatsApp : Click to Join