Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 5 ఎవరు ఉంటారన్న డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ఆడియన్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు. స్టార్ మా సీరియల్ బ్యాచ్ నుంచి ఈ సీజన్ ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ టైం లో మరో ఇద్దరు సీరియల్ యాక్టర్స్ వచ్చారు. స్టార్ మా సీరియల్ బ్యాచ్ అంతా కూడా ఒక జట్టుగా మారి ఆట ఆడుతున్నారని మిగతా కంటెస్టెంట్స్ భావించారు.
ముఖ్యంగా శివాజి, యావర్, పల్లవి ప్రశాంత్ అందరు స్టార్ మా బ్యాచ్ కి వ్యతిరేకంగా ఆట ఆడారు. అయితే వీరిలో ఎక్కువగా అమర్ దీప్ (Amardeep,) మీద ఫోకస్ పెట్టారు. మొదటి నుంచి శివాజి, ప్రశాంత్ అమర్ దీప్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. అతను కూడా మొదట్లో ఫౌల్ గేమ్స్ ఆడి బకరా అయ్యాడు. వీకెండ్ నాగార్జున (Nagarjuna)తో చీవాట్లు తిని ఫైనల్ గా ఆరో వారం నుంచి సెట్ రైట్ అయ్యాడు.
We’re now on WhatsApp : Click to Join
మొన్నటిదాకా అమర్ టాప్ 5 లో ఉంటాడా లేడా అన్న డౌట్ ఉండేది కానీ అతనికి ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ వల్ల అమర్ తప్పకుండా టాప్ 5 లో ఉండే అవకాశం ఉందని కనిపిస్తుంది. అమర్ తో పాటుగా శివాజి (Sivaji), ప్రశాంత్, యావార్ లలో ఇద్దరు ఉంటారు. ఆ తర్వాత అర్జున్ ప్రియాంకా గౌతం లలో ఒకరు టాప్ 5 కి వెళ్లే ఛాన్స్ ఉంది.
ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా అమర్ దీప్ మాత్రం కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడని మాత్రం చెప్పుకోవచ్చు. అమర్ దీప్ కి సీరియల్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతను కచ్చితంగా టాప్ 5లో ప్లేస్ దక్కించుకుంటాడని అంటున్నారు.
Also Read : NTR : వార్ 2 కి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చేశాడా.. తారక్ సెట్స్ లో అప్పుడే వస్తాడా..?