Bigg Boss 6: ఎంత ఆడినా ఫలితం లేదు.. వాసంతి ఎమోషనల్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కొట్లాటలు గొడవలు ఏడుపులతో రసవత్తరంగా సాగుతోంది. అయితే

Published By: HashtagU Telugu Desk
Bigg Boss

Bigg Boss

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కొట్లాటలు గొడవలు ఏడుపులతో రసవత్తరంగా సాగుతోంది. అయితే తాజాగా వారంలో భాగంగా బిగ్ బాస్ కంటేస్తుంటే సరిగా ఎంటర్టైన్ చేయడం లేదు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో కంటెస్టెంట్లు బిగ్ బాస్ దారిలోకి వచ్చారు. అంతేకాకుండా ఇకపై బిగ్ బాస్ చెప్పినట్టుగా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందిస్తాము అంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. దీంతో హౌస్ మేట్లకు కడుపు మాడ్చిన బిగ్ బాస్ ఆ తర్వాత వారికి ఫుడ్ ని ఏర్పాటు చేశాడు.

అయితే మొదట ఫుడ్ కోసం టాస్క్ లో గెలవాలి అని చెప్పి ముప్పు తిప్పలు పెట్టి ఆ తర్వాత హౌస్ లో ఉండేందుకు అర్హత కోసం పోటీపడాలి అని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే కంటెస్టెంట్ లు చెమటలు పట్టించే విధంగా రకరకాల టాస్కులు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఉండే అర్హత కోసం ఇంటి సభ్యులు బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ని ఆడారు. నేపథ్యంలోనే ఈ టాస్ లో ఇనయ టీమ్ గెలవగా శ్రీ సత్య టీమ్ ఓడిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ ఓడిన టీం లో నుంచి ఒకరిని తర్వాత వారానికి నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించడంతో కంటెస్టెంట్లు అందుకు అనుగుణంగా నామినేట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే రాజ్ వాసంతి పేరును ఎత్తడంతో వెంటనే సీరియస్ అయ్యింది. ఎంటర్టైన్మెంట్ టాస్క్ తర్వాత ఎన్ని ఆటలు ఆడలేదు. అయినా సరే తీసుకువచ్చి లిస్టులో నిలబెడితే ఎంత బాధ ఉంటుంది అంటూ ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది వాసంతి. అలా ఫైనల్ గా వాసంతిని నామినేషన్ లోకి పంపించారు. మరొకవైపు సోషల్ మీడియాలో ఏడవ వారం హౌస్ లో నుంచి ఎవరు ఎలిమెంట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి.

  Last Updated: 21 Oct 2022, 06:25 PM IST