Bigg Boss Season 6: బిగ్ బాస్ హౌస్ లోకి సుడిగాలి సుధీర్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా?

తెలుగులో ప్రసారమవ్వుతున్న బిగ్ బాస్ సీజన్ 6.. అంతగా ప్రేక్షకాదరణ పొందడం లేదు అని తెలుస్తోంది. అయితే గత

  • Written By:
  • Updated On - October 3, 2022 / 09:50 PM IST

తెలుగులో ప్రసారమవ్వుతున్న బిగ్ బాస్ సీజన్ 6.. అంతగా ప్రేక్షకాదరణ పొందడం లేదు అని తెలుస్తోంది. అయితే గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి బిగ్బాస్ సీజన్ 6 లో ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఉంటుంది అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ప్రేక్షకులు ఆశించిన విధంగా బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ దొరకడం లేదు. హౌస్ లో కంటెస్టెంట్లు కేవలం ఎంతసేపు గొడవలు, అలకలు, మాటలే తప్పితే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం చేయడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎలాగైనా ఎంటర్టైన్మెంట్ ను మరింత పెంచి రేటింగ్ను మరింత పెంచడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగానే హౌస్ లోని కంటెస్టెంట్ లతో సరికొత్త టాస్కులు ఆడించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఏదో లోటుగా ఉండడంతో ఎంటర్టైన్మెంట్ ను మరింత పెంచడానికి జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ ను హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ గా తీసుకురానున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చర్చలు కొడుతోంది. ప్రస్తుతం సుధీర్ వరుస సినిమాలు, షోలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో సుడిగాలి సుధీర్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

అంతే కాకుండా సుడిగాలి సుదీర్ కోసం అభిమాన సంఘమే ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సుడిగాలి సుదీర్ ని హౌస్ లోకి పంపితే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అలాగే రేటింగ్ కూడా వస్తుంది అని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తున్నారట. దీంతో బిగ్ బాస్ హౌస్ లోకి సుధీర్ ని పంపించడానికి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ లో జబర్దస్త్ కమెడియన్లు అయినా ఫైమా,చలాకి చంటి లు ఉన్న విషయం తెలిసిందే. మరి బిగ్ బాస్ హౌస్ లోకి సుధీర్ ఎంట్రీ ఇస్తాడా అంటే ఏమో అన్నట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై సుడిగాలి సుధీర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.