Site icon HashtagU Telugu

Bigg Boss 6 Telugu: సత్యతో లవ్ ట్రాక్ కోసం పరితపిస్తున్న అర్జున్?

Bigg Boss 6 Telugu

Bigg Boss 6 Telugu

బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు ఇటీవలే మొదలైయి అప్పుడే మూడో వారానికి చేరుకుంది. కాగా ఇక మూడో వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అడవిలో ఆట అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో భాగంగా కొంతమంది కంటెస్టెంట్లను పోలీసులుగా మరి కొంతమందిని దొంగలుగా విభజించాడు బిగ్ బాస్. ఈ ఆట కొట్లాటలు, గొడవలు, వార్నింగులతో రసవత్తరంగా సాగుతోంది. కాగా ఈ ఆట చివరి దశకు చేరుకుంది. ఇక చివరి రోజున కూడా పోలీసులకు దొంగలకు మధ్య వాగ్వాదం నడుస్తూనే ఉంది.

పట్టుబడిన మేరీనాను దొంగలు బెడ్ రూమ్ లో వేసి లాక్ చేస్తారు. ఇక లోపల ఉన్న మెరీనా అక్కడ ఉన్న కబోర్డ్స్ లలో బొమ్మలను వెతుకుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెరినా అటువంటి యాక్సిస్ లేదని అలా చేయడానికి వీలు లేదు అని నేహా ఫైర్ అయ్యింది. ఇక వెంటనే మీది నాకు కూడా ఏమాత్రం తగ్గకుండా నేహా పై పైర్ అయ్యింది. మరొకవైపు గీతూ బొమ్మను కొంటాను అంటూ దొంగలతో డీల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. చివర్లో బహుమతి కూడా ఇస్తాను అంటూ వారికి ఆఫర్ ను ప్రకటిస్తుంది.

ఇది ఇలా ఉంటే హౌస్ లో సత్యతో పులిహోర కలపడానికి అర్జున్ తెగ ట్రై చేస్తున్నాడు. ఆమెతో లవ్ ట్రాక్ నడపడానికి బాగానే ప్రయత్నిస్తున్నాడు అర్జున్. అయితే అర్జున్ సత్య తో లవ్ ట్రాక్ కోసం పరితపిస్తున్న కూడా సత్య మాత్రం హౌస్ లో ఉన్న అందర్నీ అన్నయ్య అనే పిలుస్తాను అని చెప్పడంతో అర్జున్ కాస్త ఫీల్ అయినట్లుగా కనిపిస్తోంది.

Exit mobile version