Site icon HashtagU Telugu

Bigg Boss Season 6: సూపర్ ట్విస్ట్.. ఒక్క ఎపిసోడ్ తో టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయిన ఇనయా!

Bigg Boss

Bigg Boss

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఊహించే దానికి ఎప్పుడు వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటాయి. తాను ఒకటే తలిస్తే దైవం ఒకటి తలచినట్టు ప్రేక్షకులు ఒకటి అనుకుంటే బిగ్ బాస్ హౌస్ లో ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. తాజాగా నాలుగో వారం నామినేషన్స్ కూడా అదే రేంజ్ లోనే జరిగాయి.

ఇకపోతే నాలుగో వారం హౌస్ లో హౌస్ మేట్ వర్సెస్ ఇనయా అన్నట్లుగా సాగింది. ఎప్పటిలాగే హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆమెను టార్గెట్ చేశారు. ఇక నాలుగో వారం శ్రీహన్, సుదీప, గీతు, ఆరోహి, చంటి,సూర్య, రోహిత్, మెరీనా,కీర్తి తో పాటు మొత్తం 9 మంది ఇనయా ని నామినేట్ చేశారు. అయితే శ్రీ హాన్ తో ఇనయాకీ మొదటి నుంచే గొడవ ఉండటంతో అతడు తప్పకుండా నామినేట్ చేస్తాడు అని ముందే ఊహించారు. ఇక శ్రీహన్,ఇనయా ల మధ్య పిట్ట మళ్లీ వచ్చింది.

ఆ తర్వాత ఇనయా శ్రీహరి నామినేట్ చేయడానికి వెళితే శ్రీహాన్ కావాలనే ఆవలిస్తూ కాస్త ఓవర్ చేశాడు. అయితే శ్రీహాన్ అలా చేయడం ఇనయా కీ ప్లస్ అయ్యింది. అయితే అందరూ నామినేట్ చేసిన పెద్దగా రియాక్ట్ అవ్వని ఇనయా, మెరీనా అలాగే రోహిత్ నామినేట్ చేయడంతో ఆమె అది ఊహించలేదు అంటూ ఎమోషనల్ అయింది. ఇలా ఉంటే సోమవారం జరిగిన ఒక్క ఎపిసోడ్ తోనే ఇనయా గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఎంతలా మారిపోయింది అంటే ఓటింగ్లో రేవంత్ తరువాత రెండవ స్థానంలో ఇనయా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇనయా పేరు ట్రెండింగ్ అవుతోంది.