Bigg Boss Season 6: ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. ఆటలు,కొట్లాటలు గొడవలతో రోజు రోజుకి

Published By: HashtagU Telugu Desk
Bigg Boss Season 6

Bigg Boss Season 6

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. ఆటలు,కొట్లాటలు గొడవలతో రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చూస్తుండగానే అప్పుడే అయిదు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.

తాజాగా ఐదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా చలాకీ చంటి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పుడే బిగ్ బాస్ హౌస్ లో ఆరవ వారానికి సంబంధించిన నామినేషన్ రచ్చ మొదలైంది. ఇక ఆరోవారం నామినేషన్స్ కూడా పూర్తికాగా మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. బాలాదిత్య, గీతూ, ఆదిరెడ్డి, సుదీప, శ్రీహాన్, కీర్తి, రాజశేఖర్, శ్రీ సత్య, మెరీనా. ఈ తొమ్మిది మంది ఆరవ నామినేషన్స్ లో భాగంగా అయ్యారు.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఐదవ వరం ఎలిమినేషన్ ముగిసిన తరువాత ఆర్ జె సూర్య, ఇనయ లు రెచ్చిపోయారు. ఇక రాత్రి లైట్స్ ఆఫ్ అయిన తరువాత సూర్య ఏకంగా ఇనయ ఒడిలో తల పెట్టుకుని మరీ పడుకున్నాడు. ఇనయ కూడా ఏమాత్రం తగ్గకుండా అతని తల నొక్కుతూ కనిపించింది. ఇకపోతే అప్పుడే ఆరో వారం ఎలిమినేషన్ సంబంధించి ఈ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారు అంటూ జోరుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

  Last Updated: 11 Oct 2022, 08:29 AM IST