Site icon HashtagU Telugu

Bigg Boss Season 6: నామినేషన్స్ లో శపథం చేసిన ఇనయ సుల్తానా.. టైటిల్ కొడతానంటూ!

Bigg Boss Season 6

Bigg Boss Season 6

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఆరోహి ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే. దీంతో హౌస్ లోకి ఏమైనా 17 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే అప్పుడే ఐదవ వారం నామినేషన్స్ రచ్చ మొదలయ్యింది. అయితే గత వారం కొట్లాటలో గొడవలతో హోరెత్తిన నామినేషన్స్ ఈవారం మతం చాలా కూల్ గా అన్నట్టుగా సాగుతోంది.

కాగా తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోనీ విడుదల చేశారు. నామినేషన్స్ లో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసి వాళ్లకు సంకెళ్లు వేసి నామినేషన్స్ కాకుండా ఉండటం కోసం అర్హతని చెప్పుకోవాలి. వాదనల అనంతరం ఇద్దరిలో ఒకరు ఎలిమెంట్ కావడం తప్పనిసరి అని ఆదేశించారు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత ఇనయ, శ్రీహాన్ లకు సంకెళ్లు వేశారు బిగ్ బాస్. అప్పుడు ఇనయ నేను బాగా ఆడుతున్నాను నామినేట్ కావాలని అనుకోవడం లేదు అని అనగా..

వెంటనే శ్రీహాన్ పనులు చేస్తున్నావ్ కానీ ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక వెంటనే ఇనయ బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు అన్ని కలిపి అని అంటుంది. అప్పుడు శ్రీహన్ నువ్వు నా ఫ్రెండ్ వే అని అనడంతో.. వెంటనే ఇనయ ఇప్పుడు నామినేషన్స్ ఇచ్చేయాలి కాబట్టి ఫ్రెండ్ వే అంటున్నావు.. వావ్ గ్రేట్ యాక్టర్.. నేను నామినేట్ అవుతున్న టైటిల్ కొట్టుకునే వెళ్తాను.. నీకంటే డిజైర్ వింగ్ అంటూ సవాలు చేసి తనంతట తానుగా నామీనేట్ అయింది ఇనయ.