Bigg Boss 6: టాప్ 2లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఆ ప్లేస్ లో ఆమెను చూసి నెటిజన్స్ షాక్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే 9 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని పదవ

  • Written By:
  • Updated On - November 8, 2022 / 03:30 PM IST

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే 9 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని పదవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి 9 మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక పదోవారం నామినేషన్ కి సంబంధించిన రచ్చ అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే ఇక పదోవారం నామినేషన్స్ లో భాగంగా తొమ్మిది మంది ఉన్నారు. ఇక పదో వారం కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యింది. అయితే ఈసారి కూడా ఎప్పటిలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు మొత్తం అందరూ కలిసి ఇనాయ ని టార్గెట్ చేశారు.

ఇక ఇనాయ తన వాయిస్ విషయంలో కాకుండా ఆట తీరు విషయంలో కూడా అందరికీ స్పెషల్ గా మారిపోయింది. కాగా ఇనాయ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన నోటితో అందరిని శత్రువులుగా మార్చుకోవడంతోపాటు ఆటలో కూడా శత్రువులను పెంచుకుంది. అలా కంటెస్టెంట్లకు అందరికీ శత్రువుగా మారినప్పటికీ టాప్ 2 కి వెళ్లే సత్తాను సాధించుకుంది ఇనాయ. కాదా టాటూలో సింగర్ రేవంత్ అలాగే గీతూ, శ్రీహాన్ లు ఉంటారు అని భావించినప్పటికీ గీతూ ని ఎలిమినేట్ చేసి బయటకు పంపించడంతో శ్రీహాన్ ను పక్కన పెట్టేసిన బిగ్ బాస్ ప్రేమికులు సెకండ్ ప్లేస్ కి ఇనాయ కట్టబెడుతున్నారు.

ఎలా అయినా టైటిల్ గెలవాలి అన్న కసితో రేవంత్ ఫేవరెట్ అగ్రేసివ్ గా ఆకట్టుకుంటూ ఉండగా, ఇనాయ కూడా తన ఆటతో అగ్రెసివ్ గా అదరగొడుతోంది. అయితే మొదట్లో టాప్ 2 లో ఇతర కంటెస్టెంట్లు పేర్లు వినిపించినప్పటికీ ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇనాయ ఉండాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు మొదలయ్యాయి. కాబట్టి హౌస్ లో ఇనాయ టాప్ ఫైవ్ లో కాకుండా టాప్ 2 లో రేవంత్ వర్సెస్ ఇనాయ లా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.