Bigg Boss 6: నువ్వు మగాడివేనా అంటూ శ్రీహాన్ పై నోరు జారిన ఇనయా?

మూడవ వారం కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్ చివరి దశకు చేరుకుంది. కానీ కంటెస్టెంట్ల మధ్య గొడవలు మాత్రం ముగిసేలా

Published By: HashtagU Telugu Desk
Bigg Boss 6

Bigg Boss 6

మూడవ వారం కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్ చివరి దశకు చేరుకుంది. కానీ కంటెస్టెంట్ల మధ్య గొడవలు మాత్రం ముగిసేలా కనిపించడం లేదు. ఇక ఈ టాస్క్ లో ఎక్కువ బొమ్మలు ఉన్న పోలీస్ టీమ్ విజేతలుగా నిలుస్తారు. అదేవిధంగా కెప్టెన్సీ కంటెండర్స్ సత్య, గీతూ, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్‌ లను టీం సభ్యులు ఎన్నుకుంటారు. అనంతరం జరిగిన టాస్కులో భాగంగా మొదట గీతూ ఎలిమినేట్‌ అవుతుంది. ఆ తర్వాత బ్రిక్స్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఫైమా చేతులు ఉపయోగిస్తుంది. దీంతో రేవంత్‌ ఆమెను డిస్‌ క్వాలిఫై చేస్తాడు.

ఇక ఇదే విషయంలో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్‌ జరిగినా రేవంత్‌ సంచలాక్‌ గా ఉన్నందున అతని నిర్ణయం ఫైనల్‌ అవుతుంది. అయితే ఫైమా డిస్‌ క్వాలి ఫై అనడంతో వెంటనే ఇనయా ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ఇనయా శ్రీహాన్‌ చేతులు తగలడం నేను చూశాను అంటూ రేవంత్‌ కి చెబుతుంది. ఇక ఇనయా మాటలు విన్న శ్రీహాన్‌ ఏ పిట్ట వచ్చి నీ దగ్గర ఏం కూసినా సంచాలక్‌ గా నీ నిర్ణయం నువ్ తీసుకో అని అంటాడు. ఇక వెంటనే ఇనయా శ్రీహాన్ తో గొడవకు దిగుతుంది.

నన్ను పిట్ట అని ఎలా అంటావంటూ ఇనయా అంటూ అరుస్తుంది. నిన్ను వాడు అంటే తీసుకోలేని వాడివి నన్ను పిట్ట అని ఎందుకు అన్నావ్‌ అని ఇచ్చి పోయి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే గీతూ వచ్చి అతను నిన్ను అనలేదు, నన్నే పిట్ట అన్నాడు అని సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా కూడా ఇనయా వినిపించుకోకుండా అలాగే మాట్లాడడంతో వెంటనే గీతూ ఇనయాని హేళన చేస్తున్నట్లు ప్రవర్తిస్తూ వచ్చిందీ పాలపిట్టా అంటూ ఇష్టం వచ్చిన విధంగా పాటలు పాడుతూ ఇనయా నీ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇనయా గట్టిగా అరుస్తూ శ్రీహాన్‌ అ‍క్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మగాడివైతే నేను చెప్పింది విని అంటూ ఇనయా మాటలు హద్దులు దాటుతుంది.

  Last Updated: 23 Sep 2022, 03:27 PM IST