Site icon HashtagU Telugu

Bigg Boss 6: డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో!?

Bigg Boss Season 6

Bigg Boss Season 6

Bigg Boss 6: ఎంటర్‌టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్.. అంటూ అక్కినేని నాగార్జున స్టార్ మా ఛానల్ లో సందడి చేస్తూ ప్రారంభించిన షో ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం ఐదో వారం కొనసాగుతోంది. వారానికొకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఐదో వారంలో 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. ఇనయ, చంటి, అర్జున్, ఆదిరెడ్డి, మెరీనా, ఫైమా, బాలాదిత్య, వాసంతి నామినేట్ అయ్యారు. ఆడియన్స్ ఓటింగ్ కు వెళ్లగా.. వారంలో ప్రతి రోజూ లెక్కలు మారుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 6లో ఇప్పటి వరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఆసక్తికరంగా సాగిపోతున్న ఈ షోలో షానీ సాల్మన్, అభియనయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి వరుసక్రమంలో ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐదో వారంలో 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలోనూ రోజు రోజుకూ లెక్కలు మారుతున్నాయి. అనధికారికంగా పోల్ గమనిస్తే, ఆదిరెడ్డి, ఇనయ సుల్తానా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే, వీరిలో అతి తక్కువ ఓటింగ్ తో ఇనయ అగ్ర స్థానంలో ఉంది. అయితే, ఇవి తొలి రెండు రోజుల గణాంకాలు మాత్రమే. మూడో రోజు బుధవారానికి ఈ లెక్కలు మారాయి.

ఊహాతీతంగా వాసంతి మొదటి స్థానంలోకి వచ్చింది. వాస్తవానికి ఇనయకి మొదటి స్థానం వస్తుండగా, ఇదే వారంలో ఆర్జే సూర్యకి క్లోజ్ గా ఉంది. ఈ పరిణామం నచ్చక ఇనయ ఓటింగ్ గ్రాఫ్ బాగా తగ్గిపోయింది. అదే క్రమంలో ఆరోహి విషయంలో ఎలా జరిగిందో, ఇప్పుడు ఇనయ ఓట్ల శాతం తగ్గడానికి ఆర్జే సూర్య కారణమయ్యాడు. అయితే, ఆర్జే సూర్య బాధితుల జాబితాలో ఇనయ చేరడం అసలు పెద్ద విషయం కాదు. ఈ వారం ఫైమా ఆటలో మంచి ప్రదర్శన కనబరిచి తన గ్రాఫ్ ని పెంచుకుంది.

తర్వాత ఓటింగ్ శాతం గమనిస్తే, అర్జున్ కల్యాణ్, మెరీనా, బాలాదిత్య, చంటి ఓటింగ్ లో పోటీ పడుతున్నారు. వీరికి పెద్ద తేడాలు కూడాలేవు. ఐదుగురిలో అర్జున్ కల్యాణ్ కు సింపతీ ఓట్లు పడ్డాయి. కాస్త బెటర్ గా ఉన్నాడు. బాలాదిత్య, మెరీనా, చంటి డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ఈరోజు అర్ధ రాత్రి వరకు ఉండడంతో ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సస్పెన్స్ గా మారింది.

Exit mobile version