రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss) ..నార్త్ ఆడియన్స్ ను మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ ను సైతం ఎంతగానో అలరిస్తుంది. తెలుగు (Bigg Boss Telugu) విషయానికి వస్తే గత సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సీజన్ 7 (Telugu Bigg Boss 7) మాత్రం ఉల్టా పుల్టా చేస్తూ రేటింగ్ లో దూసుకెళ్తుంది. ప్రస్తుతం 11 వారానికి చేరుకుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారో అనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది.
ఇదిలా ఉంటె రీసెంట్ గా హిందీలో ప్రారంభమైన సీజన్ 17 (Bigg Boss 17) కు సంబదించిన ఓ వార్త ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. ఈ సీజన్ లో బాలీవుడ్ జంట అంకితా లోఖండే (Ankita Lokhande)- విక్కీ జైన్ (Vicky Jain) హౌస్ లోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ జంట ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇద్దరు గొడవలు పడడం , ఆ తర్వాత కలుసుకోవడం వంటివి ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా అంకిత లోఖండే.. ఓ ఆసక్తికర విషయానికి భర్త కు తెలియజేసింది.
We’re now on WhatsApp. Click to Join.
‘నాకెందుకో ఒంట్లో బాగోలేనట్లు అనిపిస్తోంది. నాకు ఈ నెల పీరియడ్స్ కూడా రాలేదు. ఇంటికి వెళ్లాలనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. దీంతో అవాక్కైన విక్కీ.. అదేంటి? నీకు పీరియడ్స్ వచ్చాయనుకున్నానే అని చెప్పగా.. లేదు.. నన్ను మెడికల్ రూమ్‌కు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్ (Ankita Lokhande Pregnancy Test) చేశారు. నిన్న రక్తపరీక్షలు చేశారు. ఈరోజు మూత్రపరీక్ష చేశారు. కానీ ఫలితాలను మాత్రం చెప్పలేదు..వారు ఎంచెపుతారో అని ఎదురుచూస్తున్న..టెన్షన్ అవుతోంది. నేను ఎలా ఫీలవుతున్నాననేది మాటల్లో చెప్పలేను. ఏమీ అర్థం కాకుండా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ఒకవేళ పాజిటివ్ ఫలితాలు వస్తే మాత్రం బిగ్‌బాస్ హౌస్‌లో పేరెంట్స్ అయిన జంటగా ఈ దంపతులు చరిత్రలో నిలిచిపోతారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
Read Also : Harish Shankar : వాళ్లకు హరీష్ శంకర్ సమాధానం ఇదే.. ఇకనైనా అవి ఆపుతారా..?