Priyanka Jain: తిరుపతి మెట్ల మార్గంలో బిగ్ బాస్ ప్రియాంక, శివ్.. చిరుత రావడంతో భయంతో పరుగులు!

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 06:28 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ప్రియాంక. ఇటీవలె తెలుగులో ముగిసిన బిగ్బాస్ సీజన్ సెవెన్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే. బుల్లితెరపై సీరియల్స్ నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మరింత దగ్గర అయింది.

ముఖ్యంగా స్టార్ మాలో ప్రసారమైన మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ ద్వారా భారీగా క్రేజ్ ని సంపాదించుకుంది ప్రియాంక. ఇకపోతే ఈమె నటుడు శివ్ తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. మౌనరాగం సీరియల్ లో ఇద్దరు కలిసి నటించగా అప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక అప్పటినుంచి వీరిద్దరూ కలిసి నివసిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ థంబ్ నైల్ పెట్టేసింది. ఇటీవల ప్రియాంక తన ప్రియుడు శివకుమార్, స్నేహితురాలు హర్షిత కలిసి తిరుమల వెళ్లినట్లుగా తెలుస్తోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు సాయంకాలం సమయంలో కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లారు.

అయితే మధ్యలో ప్రియాంకకు చిరుత వచ్చిందంటూ భయపెట్టాడు శివ. దీంతో చిరుత వచ్చిందంటూ హడావిడి చేశారు. ఆ తర్వాత తాము చూసింది చిరుత కాదని, ఘాట్ రోడ్డులో వెళ్తున్న కారు హెడ్ లైట్స్ అని, కానీ అవి చిరుత కళ్లలాగా కనిపించాయంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే చిరుత వచ్చిందంటూ వీరిద్దరు పరిగెత్తిన సమయంలో వారి వెనక మరికొందరు జనాలు నడుస్తూ కనిపించారు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ తిరుపతి మెట్ల దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ థంబ్ నైల్ పెట్టడంతో వీరిపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. తిరుమల వెళ్లే భక్తులకు మళ్లీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. తిరుపతి వెళ్లే భక్తులకు భయందోళనకు గురిచేయకండి. నీకేమన్నా చేతనైతే మంచి వీడియోలు పెట్టండి. అంతేకానీ ఇలా దేవాలయాల వద్ద భయంకరమైన ప్రదేశాలలో ఫ్రాంక్ వీడియోలు చేసి ప్రజలను మరింత భయపెట్టకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.