Pushpa2 Item Song: పుష్ప2 ఐటెం సాంగ్ లో నటించే హాట్ బ్యూటీ ఎవరో తెలుసా!

పుష్ప సినిమా ఎంత హిట్ అయ్యిందో, ఆ సినిమాకు మించి ఊ అంటావా పాట ఓ ఊపు ఉపేసింది.

Published By: HashtagU Telugu Desk
Pushpa2

Pushpa2

ఈ రోజుల్లో తెరకెక్కే భారీ బడ్జెట్ మూవీస్ లో స్పెషల్ ఐటెం సాంగ్ (Item Song) పెట్టడం ట్రెండ్ గా మారింది. ప్రేక్షకులు మెలోడీ పాటలతో పాటు మాస్ బీట్స్ తో కూడిన ఐటెం సాంగ్ ను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిగా చూపున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఐటెం సాంగ్స్ ను తీర్చిదిద్దుతున్నారు. అయితే ఐటెం సాంగ్ అనగానే చాలామందికి మొదటకు గుర్తుకువచ్చేది ‘‘ఊ అంటావా మావా.. ఊఊ అంటవా మావా’’ (Oo Antava). పుష్ప సినిమా ఎంత హిట్ అయ్యిందో, ఆ సినిమాకు మించి ఊ అంటావా పాట హిట్ అయ్యింది. అయితే పాట కోసం మొదట బాలీవుడ్ బ్యూటి దిశా పటానీని (Disha Patani) అడగడం, ఆమె భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ అవకాశం సమంతకు దక్కింది.

ఇక సమంత  (Samantha) సెక్సీ స్టెప్పులు, మతెక్కించే డాన్స్ తో అదరగొట్టింది. ఊ అంటావా పాట సమంతకు ఓ రేంజ్ లో పాపులారిటీ తీసుకొచ్చింది. తాజాగా పుష్ప2 మూవీ కూడా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతుండటంతో మళ్లీ సమంత ఓ స్పెషల్ సాంగ్ (Oo Antava 2) అలరిస్తుందని చాలామంది భావించారు. కానీ సమంత నటించడం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పుష్ప2 లో సమంత స్థానంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కాజల్ (Kajal Aggarwal), అల్లు అర్జున్ కలిసి పలు సినిమాలు చేయడం, వారిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండటంతో కాజల్ కోసం ప్రత్యేకంగా ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. పుష్ప1 కు మించి ఐటెం సాంగ్ ఉండబోతోంది అని ఇప్పటికే దేవీశ్రీ ప్రసాద్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట కోసం కాజల్ అగర్వాల్ ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం మేకర్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Also Read: Kushi 1st Song: ఖుషి నుంచి ఫస్ట్ పాట రిలీజ్.. విజయ్, సమంత కెమిస్ట్రీ అదుర్స్!

  Last Updated: 09 May 2023, 01:14 PM IST