Site icon HashtagU Telugu

Exclusive: బిగ్ అప్డేట్, రాజమౌళి-మహేశ్ మూవీ షురూ అయ్యేది అప్పుడే

Mahesh Rajamouli Movie Muhurtam Date Locked

Mahesh Rajamouli Movie Muhurtam Date Locked

Exclusive: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు.. అందరి కళ్లు ఆ సినిమాపైనే ఉంటాయి. ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో సంచలనాత్మక కాంబినేషన్ అయినా రాజమౌళి, మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన అదిరిపొయే అప్డేట్ వచ్చేసింది. రాజమౌళి మహేశ్ మూవీ కోసం స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు.

ఇందులో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించనున్నారు. కథకు సంబంధించిన ప్రారంభ కాన్సెప్ట్‌ను అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే టీం అందించారు. రాజమౌళి తన రచయితల బృందంతో కలిసి ప్రస్తుతం ఫైనల్ స్క్రీన్‌ప్లేను రూపొందిస్తున్నారు. రాజమౌళి 2024 జనవరిలో ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నారు, ఉగాది పండుగ తర్వాత రెగ్యులర్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. మహేశ్ బాబు “గుంటూరు కారం” కోసం ప్రమోషనల్ వర్క్‌ను పూర్తి చేసిన వెంటనే రాజమౌళి అడ్వెంచర్ థ్రిల్లర్‌కు సినిమా పనులు షురూ అవుతుతాయి.

ఈ చిత్రం ప్రధానంగా అరణ్యాలు, విదేశీ లొకేషన్లతో పాటు ఎక్కువ భాగం షూటింగ్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. ఇక అదనంగా ఈ చిత్రం కొన్ని భాగాలు దక్షిణాఫ్రికా, యూరప్‌లో చిత్రీకరించబడతాయి. ప్రాజెక్ట్ కోసం అధికారిక ప్రారంభ తేదీ త్వరలో నిర్ణయించబడుతుంది. “క్షణ క్షణం” వంటి చిత్రాలకు పనిచేసిన నిర్మాత కెఎల్ నారాయణ 20 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి చిత్ర నిర్మాణంలోకి వస్తున్నారు.

Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు