Site icon HashtagU Telugu

Thug Life: కమల్, మణిరత్నం మూవీపై భారీ అంచనాలు.. ‘థగ్ లైఫ్’ రిలీజ్ ఎప్పుడంటే!

Another Hero Exit From Kamal Hassan Thug Life Maniratnam Movie

Another Hero Exit From Kamal Hassan Thug Life Maniratnam Movie

Thug Life: లెజెండ్స్ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ ప్రాజెక్టుకు విపరీతమైన హైప్ వస్తున్నా కమల్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా చాలా ఆలస్యమవుతోంది. షెడ్యూల్ విభేదాల కారణంగా జయం రవి, దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని పలు వార్తలు వచ్చాయి.

దుల్కర్ పోషించాల్సిన పాత్రను శింబు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శింబు జైసల్మేర్ లో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో శింబు చేరికను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2025 సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ పతాకాలపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూరుస్తున్నారు.

కాగా కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ లో వెల్లడించారు. కమల్ సరికొత్త వేషధారణలో కనిపించి ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. కమల్, మణి కాంబినేషన్ లో వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.