Site icon HashtagU Telugu

Mahesh Babu Entering To Bollywood: ఆ సినిమాతో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ!

Mahesh

Mahesh

ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్స్ బాలీవుడ్ లోనూ నటించేందుకు ఆసక్తి చూపుతుంటే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం టాలీవుడ్ జై కొట్టాడు. కొన్ని నెలల క్రితం టాలీవుడ్ నటుడు మహేష్ బాబు మేజర్ చిత్రం ప్రమోషన్ సమయంలో “బాలీవుడ్ నన్ను భరించదు” అని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మహేశ్ దారుణంగా ట్రోలింగ్ మొదలైంది. ఆ తర్వాత మహేశ్ క్షమాపణలు కూడా చెప్పారు. ప్రస్తుతం మహేశ్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నట్టు టాలీవుడ్ టాక్.

మహేష్ బాబు రాబోయే చిత్రంతో (ఎస్ఎస్ రాజమౌళి) బాలీవుడ్ లోకి ఎంటర్ కాబోతున్నట్టు తెలుస్తోంది.. మహేష్ బాబు, SS రాజమౌళి ఇద్దరి భారీ స్టార్‌డమ్ కారణంగా తమ కాంబినేషన్ లో వచ్చే మూవీని బాలీవుడ్ లోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి బాహుబాలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాలీవుడ్ ద్రుష్టిని ఆకర్షించారు. ఇక మహేశ్ ను బాలీవుడ్ కు తీసుకెళ్లి, ఇండియన్ భాక్సాఫీస్ ను షేక్ చేయాలని భావిస్తున్నాడు.