Shock to Yashoda: సమంతకు షాక్.. యశోద ‘ఓటీటీ’కి బ్రేక్!

పాన్ ఇండియా హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Yashoda

Yashoda

పాన్ ఇండియా హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పాటు మంచి కలెక్షన్లు సాధించింది. సమంత నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ సాధించిన ఈమూవీని ఓటీటీలోకి విడుదల ప్లాన్ చేయాలని చేస్తున్నారు యశోద నిర్మాతలు. అయితే సిటీ సివిల్ కోర్టు మేకర్స్‌కి పెద్ద షాక్ ఇచ్చింది.

EVA హాస్పిటల్ పేరును ఆ సినిమాలో ప్రతికూలంగా ఉపయోగించారని, అది తమ ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపిస్తూ యశోద బృందంపై EVA IVF ఆసుపత్రి ఫిర్యాదు చేసింది. దీంతో OTTలో యశోద సినిమా విడుదలను వాయిదా వేయాలని కోర్టు నిర్మాతలను ఆదేశించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా సమంత అనారోగ్యంపై కూడా రూమర్స్ వస్తున్నాయి. దీంతో సమంత మేనేజర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

  Last Updated: 24 Nov 2022, 04:51 PM IST