Site icon HashtagU Telugu

Rashmika : నేషనల్ క్రష్ కు భారీ షాక్

Rashmika Injured

Rashmika Injured

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస విజయాలతో దూసుకుపోతూ, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. గత మూడు సంవత్సరాల్లో ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను ఏర్పరుచుకుంది. అయితే ఈ విజయాల జోరు కొనసాగుతుందనుకుంటున్న సమయంలో ‘సికిందర్’ (Sikandar)రూపంలో ఆమె భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ఈద్ స్పెషల్‌గా విడుదలై తొలి షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. రష్మిక పాత్రకు కొంత ప్రశంసలు లభించినప్పటికీ సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. ఫస్ట్ వీకెండ్‌లో ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టినప్పటికీ, వీక్ డేస్‌లో షోలు క్యాన్సిల్ అవుతున్న స్థితికి చేరింది.

Great Himalayan Earthquake : వామ్మో.. అంత పెద్ద భూకంపం రాబోతోందట!

తెలుగులోనూ రష్మిక‌కు మరో మూవీ అనుకోకుండా కలిసొచ్చింది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ మొదట రష్మికకే ప్లాన్ చేయబడింది. ‘భీష్మ’ విజయవంతమైన తర్వాత, ఈ కాంబినేషన్ మరింత క్రేజ్ పెంచిందని భావించారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తో కలిసి ఓ ప్రోమో వీడియో కూడా చేసింది. అయితే డేట్స్ సమస్య వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దాంతో శ్రీలీల హీరోయిన్గా ఎంపికైంది. అయితే ఈ సినిమా కూడా నెగిటివ్ టాకే రాబట్టి బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది. దీంతో రష్మికకు దక్కాల్సిన ఓ భారీ ప్లాప్, శ్రీలీలకి వెళ్లిపోయినట్లయింది. కానీ రెండు రోజుల గ్యాప్‌లోనే ‘సికిందర్’ రూపంలో రష్మికకి భారీ పరాజయం ఎదురైంది. ‘సికిందర్’ డిజాస్టర్‌ అవ్వడం ఆమెకు ఊహించని పరిణామంగా మారింది. సల్మాన్ ఖాన్ సినిమా ఫ్లాప్ అవ్వడం అరుదైన సంఘటన అని పరిశీలకులు చెబుతున్నారు. రష్మిక వరుసగా ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించినా, ఈ ఫ్లాప్ ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Exit mobile version