Vyooham Movie: రాంగోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా (Vyooham Movie) విడుదల నిలిచిపోయింది. సినిమాపై నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ, ఆన్‌లైన్, ఇంటర్నెట్ సహా మరే వేదికల్లోనూ మూవీని విడుదల చేయకూడదని కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు దర్శకుడు రాంగోపాల్ వర్మ టీడీపీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా సినిమా తీశారని లోకేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలో.. పిటిషనర్ కుటుంబ సభ్యులు, పార్టీకి సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, సినిమాను విడుదల చేస్తే పిటిషనర్ హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని లోకేష్ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిని విచారించిన సిటీ సివిల్ కోర్టు రెండో అడిషనల్ చీఫ్ జడ్జి సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రామదూత క్రియేషన్స్ సంస్థ, నిర్మాత దాసరి కిరణ్ తదితరులకు సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. అయితే డిసెంబర్ 29న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: Golani Brigade : గాజా నుంచి పీఛేముడ్.. ఇంటికి చేరిన ఇజ్రాయెల్ గొలానీ బ్రిగేడ్
మరోవైపు.. వ్యూహం సినిమా ప్రిరిలీజ్‌కు యూనిట్ ఏర్పాట్లు చేసింది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను దర్శకుడు రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పరిశీలించారు. మరోవైపు ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.