Site icon HashtagU Telugu

Actress Hema: నటి హేమకు బిగ్ షాక్‌.. డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు పేర్కొన్న పోలీసులు

Actress Hema

Actress Hema

Actress Hema: న‌టి హేమ‌ (Actress Hema)కు బిగ్ షాక్ త‌గిలింది. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఊహించ‌ని కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవ్ పార్టీపై బెంగ‌ళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖ‌లు చేశారు. ఇందులో 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ ను పోలీసులు దాఖలు చేశారు. అయితే న‌టి హేమ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన‌డం కొస‌మెరుపు. పార్టీలో MDMA డ్రగ్ ను హేమ సేవించినట్టు ఆధారాలు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు.

హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ ల కింద కేసు న‌మోదు చేశారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. హేమతో పాటు హాజరైన మరో యాక్టర్ కు డ్రగ్స్ నెగిటివ్ గా వ‌చ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. అంత‌కుముందు న‌టి హేమ‌కు బెంగ‌ళూరులోని కోర్టు 14 రోజుల‌పాటు రిమాండ్ విధించిన విష‌యం తెలిసిందే.

Also Read: Agencies Warning : రాజకీయ నాయకులు, భద్రతా బలగాలపై ఉగ్రదాడులు.. నిఘా వర్గాల హెచ్చరిక

అయితే మొద‌ట ఈ పార్టీపై న‌టి హేమ స్పందించారు. తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని హైద‌రాబాద్‌లోనే ఉన్నాన‌ని పేర్కొన్నారు. తాను హైద‌రాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నానని ఓ వీడియోను కూడా విడుద‌ల చేశారు. అయితే ఆ వీడియోపై బెంగళూరు పోలీసులు వెంట‌నే స్పందించారు. నటి హేమ తమ అదుపులోనే ఉందంటూ ఆమెకు సంబంధించిన ఫొటోను రిలీజ్ చేశారు. మరుసటి రోజు వంట చేస్తూ మరో వీడియోని విడుదల చేసింది హేమ. రేవ్ పార్టీలో పట్టుబడ్డ 103 మంది నుంచి బెంగళూరు పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీసుకోగా.. వారిలో 86కి పాజిటివ్ గా వచ్చింది. డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడ్డాయి. అందులో హేమ కూడా ఉన్నారు.