విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి (Vijay Devarakonda – Gowtam Tinnanuri) కలయికలో “V12” మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సరైన హిట్ లేని విజయ్..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ‘మళ్ళీరావా’, ‘జెర్సీ’ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన గౌతమ్ తిన్ననూరి..ఈసారి విజయ్ తో యాక్షన్ మూవీ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళ (Kerala)లో జరుగుతుంది. కాగా ఈ చిత్రీకరణ లో ఐదు ఏనుగులు (Elephants) రోడ్ దాటే షూటింగ్ చేస్తుండగా..అందులో ఓ మగ ఏనుగు..సాదు అనే ఆడ ఏనుగు ఫై దాడి చేయడం తో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. దాడిలో గాయపడిన సాదు ఏనుగు అడవిలోకి పరుగులుపెట్టింది. ఆ ఏనుగు కోసం చాలామంది వెతకడం మొదలుపెట్టారు. నిన్నటి నుండి వెతుకుతుండగా ..ఈరోజు స్పృహ తప్పి అడవిలో కనిపించింది. వెంటనే దానికి వైద్యం చేసారు. ప్రస్తుతం సాదు ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్స్ తెలిపారు. ఏనుగు పారిపోవడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ సీన్ లేకుండానే మిగతా షూటింగ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని పుత్తుపల్లి ప్రాంతానికి చెందిన పోతన్ వార్గీస్ 1999లోనే సాధుకు శిక్షణ ఇచ్చారు. అక్కడి స్థానికులు ఇతితనమ్ గజమేళా కార్యక్రమంలో సాధుకు ‘గజరాజరత్న’ అనే బిరుదు కూడా ఇచ్చి సత్కరించారు. దాన్ని సంరక్షించే సిబ్బంది మాట చెప్పినట్లు వింటుంది కాబట్టే ఆచూకీ కనిపెట్టేందుకు గానూ వారి సహాయం తీసుకున్నారు. పుత్తుపల్లి సాధు ఇప్పటికీ చాలా సినిమాల్లో కనిపించిందని అటవీ అధికారులు తెలిపారు.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకులు గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Read Also : Canada : వెయిటర్ జాబ్ కోసం భారతీయ విద్యార్థులు అంత కష్టపడాలా..?