Site icon HashtagU Telugu

RC16 : RC16 లో మెగాస్టార్..?

Bigb Rc16

Bigb Rc16

ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram CHaran)..ప్రస్తుతం వరుస గా పాన్ ఇండియా మూవీస్ తో అలరించేందుకు సిద్ధం అయ్యాడు. శంకర్ డైరెక్షన్లో ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్లో గేమ్ చెంజర్ (Game Changer) మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాకు సంబదించిన క్రేజీ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఉప్పెన చిత్రంతో మెగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు (Buchhibabu)..రామ్ చరణ్ తో RC16 సినిమా చేస్తున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటీకే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టిన మేకర్స్..రీసెంట్ గా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) ను ఎంపిక చేసినట్లు తెలిపి అంచనాలు పెంచారు. ఇదే క్రమంలో పలు వార్తలు బయటకు వస్తూ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో రీసెంట్​గా మళ్లీ ఫామ్​లోకి వచ్చిన బాలీవుడ్ స్టార్ యాక్టర్​, యానిమల్ విలన్​ బాబీ డియోల్ ​నటిస్తున్నట్లు వార్తలు వినిపించగా..ఇప్పుడు మరో క్రేజీ వార్త వైరల్ గా మారింది. ​ఆర్​ఆర్​ సినిమాతో రామ్​చరణ్​ పాన్ ఇండియా స్టార్ కావడం వల్ల ఈ చిత్రంలో నటించే నటినటులను కూడా అన్ని ఇండస్ట్రీలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలనుకుంటుంది చిత్ర యూనిట్. అందుకే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Big B) తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే సినిమా కు మరింత అదనపు ఆకర్షణ కానుంది.

Read Also : India vs Australia: భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య టెస్టు సిరీస్‌.. వేదిక‌లివే..!