Site icon HashtagU Telugu

Amitabh Bacchan : అమితాబ్ కి ఊపు తెచ్చిన కల్కి..!

Big B Amitabh Bacchan Super Craze With Kalki

Big B Amitabh Bacchan Super Craze With Kalki

Amitabh Bacchan బిగ్ బీ అమితాబ్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కితో ఆయన పేరు మారు మోగుతుంది. ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా లో అశ్వద్ధామ రోల్ లో అమితాబ్ అదరగొట్టేశారు. సినిమాలో ప్రభాస్ తర్వాత హైలెట్ గా చెప్పుకునే పాత్రలో అమితాబ్ పాత్ర ఉంది.

ఇక వచ్చిన అవకాశాన్ని అమితాబ్ అన్నివిధాలుగా అదరగొట్టారు. కల్కి సినిమా లో ఆయన చేసిన యాక్షన్ కమిట్మెంట్ చూసి బాలీవుడ్ మేకర్స్ సైతం అవాక్కయ్యారు. తనని కేవలం ఒక టైపు పాత్రలకే అంకితం చేయగా కల్కితో మరోసారి తన విశ్వరూపం చూపించారు అమితాబ్.

కల్కి చూసిన బాలీవుడ్ మేకస్ అమితాబ్ ని ఇన్నాళ్లు సరిగా వాడుకోలేదని అనుకుంటున్నారు. ఆయన లోని మాస్ హీరో అంతేలా ఉన్నాడు. ఆయనకు తగిన క్యారెక్టరైజేషన్ రాస్తే చేసేందుకు అమితాబ్ సిద్ధంగా ఉన్నారని అనిపిస్తుంది. కల్కి ద్వారా అమితాబ్ కూడా తన జోష్ పెంచారు. సినిమా రిలీజ్ ముందు అమితాబ్ ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొంటే ఏమో అనుకున్నాం కానీ సినిమాలో ఆయన పాత్ర అంత ఫోర్స్ గా ఉంటుందని అనుకోలేదు.

మొత్తానికి అమితాబ్ అశ్వద్ధామ పాత్రతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. తప్పకుండా అమితాబ్ నుంచి మరిన్ని సినిమాలు వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. కల్కి తర్వాత అమితాబ్ తో చేసే సినిమాలకు ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటాయని చెప్పొచ్చు.

Also Read : Samantha : సమంత ఎందుకిలా చేస్తుంది..?