Site icon HashtagU Telugu

Bichagadu 2 : తిరుపతిలో బిచ్చగాళ్లతో బిచ్చగాడు 2.. బిచ్చగాళ్లకు చెన్నైలో స్పెషల్ షో..

Bichagadu 2 Hero Vijay Antony Meets Beggars in Tirupati

Bichagadu 2 Hero Vijay Antony Meets Beggars in Tirupati

విజయ్ ఆంటోనీ(Vijay Antony) గతంలో చేసిన సూపర్ హిట్ సినిమా బిచ్చగాడు(Bichagadu)కి సీక్వెల్ గా ఇటీవల బిచ్చగాడు 2 రిలీజ్ చేసి మంచి విజయం సాధించారు. విజయ్ ఆంటోనీ హీరోగానే కాక దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళ్, తెలుగులో రిలీజయిన ఈ సినిమా భారీ విజయం సాధించి మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది.

బిచ్చగాడు 2 సినిమా రిలీజ్ కి ముందు తెలుగు, తమిళ్ లో ప్రమోషన్స్ విపరీతంగా చేశారు. ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వడంతో మళ్ళీ ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా నేడు హీరో విజయ్ ఆంటోనీ తిరుపతిలో బిచ్చగాళ్లను కలిశాడు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులో బిచ్చగాళ్లతో విజయ్ ఆంటోనీ కాసేపు మాట్లాడి వాళ్లకి కిట్లు పంపిణీ చేశాడు. ఈ కిట్స్ లో దుప్పటి, కొబ్బరి నూనె, దువ్వెన, సబ్బు, షాంపూ, అద్దం, విసనకర్ర.. ఇలా పలు రోజువారీ వాడుకునే ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ స్వయంగా బిచ్చగాళ్లకు అందించాడు విజయ్ ఆంటోనీ. అనంతరం వారితో సెల్ఫీ దిగాడు విజయ్ ఆంటోనీ.

ఇక చెన్నైలో బిచ్చగాడు 2 చిత్రయూనిట్ 150 మంది బిచ్చగాళ్లకు తమ సినిమాను ఫ్రీగా చూపించారు. ఈ కార్యక్రమంలో విజయ్ ఆంటోనీ భార్య, నిర్మాత ఫాతిమా ఆంటోనీ పాల్గొన్నారు. సినిమా అనంతరం వచ్చిన బిచ్చగాళ్లందరికి దుస్తులు పంపిణీ చేశారు. దీంతో వీరి ప్రమోషన్స్ బిచ్చగాళ్లతో బిచ్చగాడు అంటూ వైరల్ గా మారాయి.

 

Also Read :  Prabhas : ఛత్రపతికి ముందు రాజమౌళిని ప్రభాస్ దూరం పెట్టాడు.. ఎందుకో తెలుసా?