Tollywood ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ ఫైట్ లో సినిమాలు నిలుస్తాయి. అయితే అలా రిలీజైన ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వదు. అలా అయితే పరిశ్రమ మరో లెవెల్ కి వెళ్తుంది. చిన్న సినిమాలను బ్రతికించాలని ఎవరు ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. ఐతే ఇందులో కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం సరైన బజ్ లేక ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి.
ఎప్పటిలానే ఈ శుక్రవారం దాదాపు 9 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. అన్నీ చిన్న సినిమాలే అయ్యాయి. ఐదారు స్ట్రైట్ తెలుగు సినిమాలు కాగా ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో రెండు సినిమాలకు మార్నింగ్ షో ఆడియన్స్ లేక కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వచ్చిందట.
కమెడియన్ అభినవ్ గోమఠం లీడ్ రోల్ లో చేసిన మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభినవ్ మార్క్ కామెడీ మూవీగా సినిమా వస్తుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. కానీ సినిమాను ప్రేక్షకులు మొదటి షోనే చూసేలా ప్రమోషన్స్ చేయలేదు. ఫలితంగా ఈ సినిమా ఆడుతున్న కొన్ని సెంటస్ లో మొదటి షోలు ఆడియన్స్ లేక క్యాన్సిల్ చేశారట.
మరోపక్క మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసింది. ఈ సినిమా కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వదిలారు. ఈ సినిమాకు సంబందించిన మార్నింగ్ షోలు కొన్ని చోట్ల క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తుంది. సినిమా తీయడం ఒక ఎత్తైతే ఆ సినిమాను ప్రమోట్ చేసి ఆడియన్స్ చూసేలా చేయడం మరో ఎత్తు. ఆ విషయంలో ఈ రెండు సినిమాలు వెనకపడ్డాయని చెప్పొచ్చు.