Bholaa Shankar : భోళా శంకర్ కేసు కొట్టేసిన కోర్టు.. డిస్ట్రిబ్యూటర్స్‌కి చీకటి రోజు.. ఫిలిం ఛాంబర్ పట్టించుకోవట్లేదు..

సిటీ సివిల్ కోర్టు ఆ కేసు కొట్టివేసి భోళా శంకర్ రిలీజ్ కి లైన్ క్లియర్ చేసింది. దీనిపై నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్, ఫిలిం ఛాంబర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  • Written By:
  • Publish Date - August 10, 2023 / 09:30 PM IST

మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా తెరకెక్కిన భోళా శంకర్(Bholaa Shankar) సినిమా రేపు ఆగస్టు 11న రిలీజ్ కానుంది. రిలీజ్ కి ముందు భోళా శంకర్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వైజాగ్ గాయత్రీ దేవి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర 30 కోట్లు తీసుకొనిఇవ్వలేదని మోసం చేశాడని, దానికి తగ్గ సినిమాలు కూడా ఇవ్వట్లేదని భోళా శంకర్ సినిమా రిలీజ్ ఆపాలని కోర్టులోకేసు వేశాడు.

అయితే నేడు సాయంత్రం సిటీ సివిల్ కోర్టు ఆ కేసు కొట్టివేసి భోళా శంకర్ రిలీజ్ కి లైన్ క్లియర్ చేసింది. దీనిపై నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్, ఫిలిం ఛాంబర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నట్టి కుమార్(Natti Kumar) మాట్లాడుతూ.. ఇది డిస్ట్రిబ్యూటర్లకు చీకటి రోజు. ఒక డిస్ట్రిబ్యూటర్ 30 కోట్లు పోగొట్టుకుని రోడ్ మీద ఉన్నాడు. సినిమా పెద్దలు చొరవ తీసుకోవాలి. సిటీ సివిల్ కోర్టు తీర్పుపై హైకోర్ట్ ను ఆశ్రయిస్తాం. కొందరి లగ్జరీ, ఎంజాయిమెంట్ కోసం డిస్ట్రిబ్యూటర్లు బలి అవుతున్నారు. మా డబ్బుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేస్తాం. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమస్యలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకుంటే మేము కోర్టులకు ఎందుకు వస్తాము అని అన్నారు. మరి ఈ వివాదంపై పరిశ్రమలో ఇంకెవరైనా మాట్లాడతారేమో చూడాలి.

 

Also Read : Jailer movie Review: జైలర్ మూవీ రివ్యూ.. రజినీకాంత్ హిట్ కొట్టినట్టేనా