Site icon HashtagU Telugu

Bhola Shankar Talk : భోళా శంకర్ టాక్..డెడ్లీ బ్లాక్ బస్టర్

Bholashankar Talk

Bholashankar Talk

మెగాస్టార్ చిరంజీవి , తమన్నా జంటగా కీర్తి సురేష్ , సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ భోళా శంకర్. తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం చిత్రానికి రీమేక్ గా తెలుగు లో డైరెక్టర్ మెహర్ రమేష్ (Mehar Ramesh )తెరకెక్కించారు. AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ ఈరోజు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుండి మొదటి ఆట మొదలవ్వగా..ఓవర్సీస్ లో అర్ధరాత్రి నుండే షో మొదలయ్యాయి. దీంతో సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సినిమా డెడ్లీ బ్లాక్ బస్టర్.. కంప్లీట్ పైసా వసూల్ మూవీ. మాస్ ఎంటర్‌టైనర్. పవర్ ప్యాక్ట్ ఫైట్స్, డ్యాన్స్, హిలేరియస్ కామెడీ సీన్లు అబ్బో సినిమాలో ఎన్ని కావాలో అన్ని ఉన్నాయి. చిరంజీవి పవర్‌ఫుల్‌గా రివెంజ్ మోడ్‌లో కనిపించారు. చిరంజీవి (Chiranjeevi ) స్క్రీన్ ప్రజెన్స్ మాములుగా లేదు. డబుల్ బ్లాక్‌బస్టర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

చిరంజీవి గారు ఇంకా చాలా రీమేక్స్ చేయాలి. భోళా శంకర్ (Bhola Shankar) లాంటి సినిమాలు మెహర్ రమేష్‌తో చేయాలి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. చిరు కామెడీ టైమింగ్, కీర్తి సురేష్ సిస్టర్ సెంటిమెంట్.. తమన్నా (Tamanna )పర్పామెన్స్.. డ్యాన్స్.. సినిమాను చూసేలా చేస్తాయి.. మహతి పాటలు అద్భుతంగా ఉన్నాయి.. ఓవరాల్ డీసెంట్ హిట్.. బాస్ తన కామెడీ టైమింగ్‌లో ఎప్పుడూ బెస్టే.. మెహర్ అద్భుతంగా తీశాడు.. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. సినిమా అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది.. ఫైనల్లీ గుడ్ వాచ్ అంటూ మరొకింతమంది ట్వీట్ చేస్తున్నారు.

ఫస్ట్ టైం చిరు..పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని ఇమిటేట్ చేశారు. పవన్ తరహాలో చిరంజీవి చేసిన సీన్ అభిమానులను విపరీతంగా అలరిస్తుంది. ముఖ్యంగా శ్రీముఖితో చిరు చేసిన ‘ఖుషి’ నడుము సీన్ స్పూఫ్ థియేటర్స్ లలో అరుపులే అంటున్నారు. కీర్తీ సురేష్ (Keerthy Suresh)ను తీసుకు వెళుతూ చిరంజీవి ఇచ్చే మాస్ వార్నింగ్ సీన్ అదిరిపోయిందని, ఎమోషనల్ సీన్లలో చిరంజీవి కన్నీరు పెట్టించాడని మరికొంతమంది చెపుతున్నారు. తమన్నా గ్లామర్ తో యూత్ కు కిక్ ఇచ్చిందని అంటున్నారు. ఓవరాల్ గా అయితే విడుదలైన అన్ని చోట్ల సినిమా కు పాజిటివ్ టాక్ వస్తుంది.

Read Also : DRDO Recruitment: డీఆర్‌డీవోలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల వరకు వేతనం.. అర్హతలివే..?