మెగాస్టార్ చిరంజీవి , తమన్నా జంటగా కీర్తి సురేష్ , సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ భోళా శంకర్ (Bhola shankar). తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం చిత్రానికి రీమేక్ గా తెలుగు లో డైరెక్టర్ మెహర్ రమేష్ (Mehar Ramesh )తెరకెక్కించారు. AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ శుక్రవారం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మెగా అభిమానులను సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎంతో నిరాశ వ్యక్తం చేసారు. వాల్తేర్ వీరయ్య హిట్ కొట్టిన చిరంజీవి..భోళా శంకర్ తో మరోసారి హిట్ కొడతాడని అంత భావిస్తే..మెహర్ తీవ్ర స్థాయిలో నిరాశ పరిచాడు. అయితే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ , బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం చిరు తన సత్తా చాటారు.
(Bhola shankar 1st Day collections )ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..
నైజాం – రూ. 4.51 కోట్ల షేర్
ఉత్తరాంధ్రలో – రూ.1.84 కోట్ల షేర్
గుంటూరు – రూ. 2.07 కోట్ల షేర్
కృష్ణ – రూ. 1.02 కోట్ల షేర్ రాబట్టింది.
మిగతా చోట్ల కలెక్షన్స్ తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా మాత్రం భోళా శంకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 – 14 కోట్లు షేర్ వరకు వసూళ్లు చేయొచ్చని అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ. 19 – 20 కోట్లు వరకూ రాబట్టచ్చు అని చెపుతున్నారు. సినిమా కు హిట్ టాక్ కలెక్షన్లు భారీగా ఉండేవని, సినిమా కు నెగటివ్ టాక్ కలెక్షన్ల ఫై భారీగా పడనుందని అంటున్నారు.
Read Also : International Youth Day 2023 : నేటి యువతే రేపటి భవిత