Bheemla Nayak: బాక్సాఫీస్ ఖల్ నాయక్ ‘భీమ్లానాయక్’

ఒకరిది ఆత్మగౌరవం, మరొకరిది అహంకారం.. అలాంటి భిన్న వ్యక్తులు ఒకరికొకరు ఎదురుపడితే ఎలా ఉంటుంది? ‘నువ్వానేనా’ అన్నట్టుగా ఉంటది. భీమ్లానాయక్ లో పవన్, రానా నటన అలాగే ఉంది. ఎన్నో వాయిదాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

  • Written By:
  • Updated On - February 25, 2022 / 03:42 PM IST

నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, తదితరులు

దర్శకుడు: సాగర్ కె చంద్ర

రన్-టైమ్: 145 నిమిషాలు

ఒరిజిన‌ల్ స్టోరీ: అయ్యప్పనుం కోషియుం

విడుద‌ల‌: ఫిబ్రవ‌రి 25, 2022

రేటింగ్: 3.25

ఒకరిది ఆత్మగౌరవం, మరొకరిది అహంకారం.. అలాంటి భిన్న వ్యక్తులు ఒకరికొకరు ఎదురుపడితే ఎలా ఉంటుంది? ‘నువ్వానేనా’ అన్నట్టుగా ఉంటది. భీమ్లానాయక్ లో పవన్, రానా నటన అలాగే ఉంది. ఎన్నో వాయిదాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అఖండ, ఫుష్ప తర్వాత అంతకుమించి భీమ్లానాయక్ ఉర్రూతలూగిస్తోంది. ఈ సినిమా లో పవన్ మేనియా ఎలా ఉంది. డేనియల్ భీమ్లానాయక్ ను ఏవిధంగా ఎదుర్కొంటాడు? అనేవి ఆసక్తికరంగా ఉంటాయి.

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళం రిమేక్ మూవీ ఇది. పవన్ కళ్యాణ్ ఈ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవడంతో, దానికి తగ్గట్టుగా రచయిత త్రివిక్రమ్ మార్పులు, చేర్పులు చేశారు. భీమ్లానాయక్ ప్రాజెక్టును తానే వెనకుండి భుజాన వేసుకున్నాడు. టైటిల్ క్యారెక్టర్‌ని పవన్ కళ్యాణ్ పోషించాడు. ఒత్తిడికి లొంగని సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పవన్ నట విశ్వరూపం చూపించాడు. ఒక మాజీ ఎంపీ కొడుకు డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి)ని చిన్నపాటి నేరానికి లాక్కెళతాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో డేనియల్ భీమ్లానాయక్ పై ప్రతీకారం పెంచుకుంటాడు. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య ఒక మడమతిప్పని పోరాటమే ఈ భీమ్లనాయక్ సినిమా. అభిమానులయితే ఇది పవర్ ప్యాక్డ్ సినిమా.. బాక్సాఫీస్ ఖల్ నాయక్ అని అభివర్ణిస్తున్నారు.

‘భీమ్లా నాయక్’ మాస్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఉంది. ఈ సినిమా పక్కా కమర్షియల్ అయినప్పటికీ అన్నివర్గాలను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. ఒకవైపు నటన విశ్వరూపం, మరోవైపు రానా శక్తివంతమైన నటనకు యంగ్ టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం తోడు కావడంతో భీమ్లానాయక్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లింది. టైటిల్ ట్రాక్ ‘లా లా భీమ్లా’ అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నప్పటికీ ఎలివేషన్ షాట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మిగిలిన పాటలు కూడా సినిమా మూడ్‌లోకి తీసుకొస్తాయి. పవన్, రానా ఇద్దరూ సీరియస్ సీన్స్ లో ఎమోషన్స్ పండించారు. ‘నువ్వా-నేనా’ అన్నట్టు పోటీ పడతారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఫ్లో కంటిన్యూ చేస్తారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఒరిజినల్‌లో ఎలా కనిపించాడో, అంతకుమంచి భీమ్లానాయక్ లో మెరిశాడు.

సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాష్  విజువల్ ఫ్లేవర్‌ను గ్రాండ్ గా అందించారు. ఇక త్రివిక్రమ్ తనదైన స్టయిల్ లో స్క్రీన్ ప్లే ఇచ్చారు. డైలాగ్స్ చాలా వరకు ఆహ్లాదకరంగా ఉన్నాయి. పంచ్ లైన్లు, అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీకి బదులుగా సెకండాఫ్‌లో వచ్చే సాంగ్స్, BGM కొంతవరకు మైనస్ గా నిలుస్తాయి. కానీ పవన్ తన నటనతో వాటిని మరిచిపోయేలా చేశాడు. ఇక రచన పరంగా ఈ సినిమా అక్కడక్కడ సీరియస్‌గా లేనివిధంగా ఉంటుంది. త్రివిక్రమ్ మొత్తం సీన్స్ ని రీఇమాజిన్ చేసి ఒరిజినల్ లాగా ప్రెజెంట్ చేశాడు. అందుకు డేనియల్ హఠాత్తుగా తన భార్య పక్షం వహించే సన్నివేశం ఓ ఎగ్జాంపుల్.

పవన్‌తో నిత్యా మీనన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఆమె నిస్సందేహంగా మంచి నటి. సంయుక్తా మీనన్ యాక్టింగ్ కూడా బాగుంది. మురళీ శర్మ, సముద్రఖని (డేనియల్ తండ్రిగా), రావు రమేష్ (నాయక్ శత్రువుగా), శత్రు, హర్షవర్ధన్, మోనికా రెడ్డి (నాయక్ లేడీ కానిస్టేబుల్‌గా), పమ్మి సాయి లాంటివాళ్లు సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు.