Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ ప్రిరిలీజ్ బ్లాస్ట్.. స్పెషల్ అట్రాక్షన్ గా పవన్, రానా!

పవన్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరిగింది. పవన్ తో పాటు కో స్టార్ రానా దగ్గుబాటి ప్రత్యేకార్షణగా నిలిచారు.

Published By: HashtagU Telugu Desk
Rana

Rana

పవన్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరిగింది. పవన్ తో పాటు కో స్టార్ రానా దగ్గుబాటి ప్రత్యేకార్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ సాధారణ నల్ల చొక్కా ధరించి కనిపించారు. రానా దగ్గుబాటి సాధారణ దుస్తులలో ఒకే దగ్గర దర్శనమిచ్చారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. యూసఫ్‌గూడలోని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ చాలా రోజుల పాటు భీమ్లానాయక్ రూపంలో వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రిరిలీజ్ వేడుక కోసం బుధవారం మధ్నాహ్నం నుంచే అభిమానుల సందడి నెలకొంది. లెక్కకు మంచి పవన్ ఫ్యాన్ కదిలిరావడంతో పోలీసుల స్వల్ప లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ రావడం కూడా మరింత స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఈవెంట్ దృష్టిలో ఉంచుకుని, పోలీసులు ముందుగానే కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.

ముందుగా ఈ కార్యక్రమం ఫిబ్రవరి 21న జరగాల్సి ఉండగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో గౌరవ సూచకంగా వాయిదా పడింది. నిర్మాతలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ “ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి. భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు వాయిదా వేసినట్టు” రెస్పాండ్ అయ్యారు.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు మేకర్స్. 2020 మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఇది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గబూటి జంటగా సంయుక్త మీనన్ కూడా నటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం థమన్ అద్భుతమైన పాటలను అందించారు. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న థియేటర్లలో విడుదలవుతున్నందున అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  Last Updated: 23 Feb 2022, 11:23 PM IST