Site icon HashtagU Telugu

Bheemla Nayak: భీమ్లా నాయక్’ సక్సెస్ మూడ్ లో చిత్రయూనిట్… గతానికి భిన్నంగా ‘పవర్ స్టార్!

Bheemla Naik Success Meet

Bheemla Naik Success Meet

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ కు ప్రత్యర్ది పాత్రలో రానా నటించారు. వీరిద్దరూ పోటాపోటీగా నటించడంతో రిలీజ్ అయిన మొదటి రోజునుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఈ నేపథ్యంలో కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. సినిమా టికెట్ ధరల విషయంలో జగన్ సర్కార్ ఇంకా నిర్ణయం తీసుకోకుండానే “భీమ్లా నాయక్” రిలీజ్ అయినప్పటికీ… కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఏపీలో కూడా టికెట్ ధరలు పెరిగి ఉంటే… వసూళ్లు తారాస్థాయిలో ఉండేవి.ఇదిలా ఉంటే… సినీ పరిశ్రమలో ఏ హీరో అయినా సరే వారు నటించిన సినిమా సూపర్ హిట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అలా ఎప్పుడూ చేయలేదు. చేయరు కూడా.

ఇంకా చెప్పాలంటే… పవన్ కళ్యాణ్ తన సినిమాలను తానే ప్రమోట్ చేసుకోరు. సినిమా హిట్ అయినా… ఫట్ అయినా కూడా ఒకేలా ఉంటారు. సినిమా ఫలితం తేడా కొడితే మాత్రం… తన రెమ్యునరేషన్ నుంచి డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఆదుకుంటూ ఉంటారు. ఇకపోతే ‘భీమ్లా నాయక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రమే పవన్ పాల్గొన్నారు. ఆ తర్వాత సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా…. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే, భీమ్లా నాయక్’ విషయంలో మాత్రం పవర్ స్టార్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు మనకు అర్దం అవుతుంది.

అదేలా అంటే… పవన్ ఎప్పుడూ కూడా సక్సెస్ మీట్ లకు అటెండ్ కాలేదు. కారు కూడా. అయితే, ‘భీమ్లా నాయక్’ సినిమా ఘన విజయం సాధించడంతో చిత్రబృందం సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఎప్పుడూ పవన్ ఇలా తన సినిమా విజయం సాధిస్తే… ఏ వేడుకలో కూడా పాల్గొనలేదు. కాకపోతే ఈసారి ‘భీమ్లా నాయక్’ చిత్రయూనిట్ ఆహ్వానం మేరకు, తనకు ఆత్మీయుడైన త్రివిక్రమ్ కోరిక మేరకే…. ఈ సెలబ్రేషన్స్ కు పవన్ అటెండ్ అయ్యారని సినీ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇలా విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో…. ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Exit mobile version