Bheemla Nayak: భీమ్లా నాయక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వ‌చ్చేసింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ అంటేనే ఓ ప్రభంజనం. పవన్ అనే పేరే ఒక పండగ అని చెప్పాలి. అలాంటిది పవన్ సినిమా OTT లో వస్తోందంటే… ఆయన ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా అనే చెప్పాలి. అందులోనూ రికార్డులు బద్దలుకొట్టే సినిమా అంటే… ఆ కిక్కే వేరు. ఇంతకీ నేను చెప్తున్న సినిమా ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదేనండి… పవన్ కళ్యాణ్ తాజా […]

Published By: HashtagU Telugu Desk
23

23

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ అంటేనే ఓ ప్రభంజనం. పవన్ అనే పేరే ఒక పండగ అని చెప్పాలి. అలాంటిది పవన్ సినిమా OTT లో వస్తోందంటే… ఆయన ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా అనే చెప్పాలి. అందులోనూ రికార్డులు బద్దలుకొట్టే సినిమా అంటే… ఆ కిక్కే వేరు. ఇంతకీ నేను చెప్తున్న సినిమా ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.

అదేనండి… పవన్ కళ్యాణ్ తాజా బ్లాక్ బస్టర్ సినిమా ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలై, రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు OTT ప్లాట్ఫామ్ లోనూ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫమ్ చేసుకుంది ఈ మూవీ. పవర్ స్టార్ అభిమానులకు గొప్ప అనుభూతిని ఇచ్చేందుకు “ఆహా”, “డిస్నీప్లస్ హాట్ స్టార్” లు రెడీ అయ్యాయి.ఇంకా చెప్పాలంటే…ఈ సీజన్ కే ఒక అతి పెద్ద సంచలనాన్ని సిద్ధం చేశాయి ఈ రెండు ఓటీటీ సంస్థలు. దాని పేరు “భీమ్లా నాయక్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఆకాశమే హద్దు అని మరోసారి నిరూపించిన సినిమా ఇది.

పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో ఆయన అభిమానులను అలరించారు. పవన్ కు ప్రత్యర్థి పాత్రలో తనదైన శైలిలో నటించారు రానా. అభిమానుల అంచనాలను అందుకుంటూనే… అంతకంటే ఎక్కువ స్థాయిలో పవర్ స్టార్ ని నిలబెట్టిన సినిమా ఇది. ‘భీమ్లా నాయక్’ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇక తమన్ సంగీతం ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇకపోతే… ఈ సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”, “ఆహా” లో మార్చి 25 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి “భీమ్లా నాయక్” సందడి మొదలవుతుంది. “భీమ్లా నాయక్” ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తోంది.

  Last Updated: 18 Mar 2022, 10:12 AM IST