Bharathanatyam: “దొరసాని” ఫేమ్ దర్శకుడు కెవిఆర్ మహేంద్ర తెరకెక్కించిన చిత్రం “భరతనాట్యం”. ఈ చిత్రంలో సూర్య తేజ ఏలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు .పిఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాలో సూర్య తేజ సరసన మీనాక్షి గోస్వామి నటించారు, వివా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు మరియు టెంపర్ వంశీ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. వేసవి సెలవుల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో “భరతనాట్యం” ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీత అందిస్తున్నాడు. వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఎడిటర్‌గా రవితేజ గిరిజాల పని చేశాడు. సూర్య తేజ ఏలే తొలి చిత్రం “భరతనాట్యం” తప్పక చూడవలసినదిగా చిత్రానిర్మాతలు కోరుతున్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందని. సమ్మర్ లో ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర
నిర్మాత: పాయల్ సరాఫ్
కథ: సూర్య తేజ ఏలే
స్క్రీన్ ప్లే: సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: వెంకట్ ఆర్ శాకమూరి
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
ఆర్ట్: సురేష్ భీమగాని
Also Read: Etela : కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎంకి అప్పుడే కళ్లు నెత్తికెక్కాయిః ఈటల