Site icon HashtagU Telugu

Bharateeyudu 2 Public Talk : మెగా ఫ్యాన్స్ లో మొదలైన భయం

Bharateeyudu 2 Public Talk

Bharateeyudu 2 Public Talk

డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ (Shankar – Kamal Hassan) కలయికలో 1996 లో వచ్చిన ‘భారతీయుడు’ (Bharateeyudu ) ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సేనాపతి , చందు క్యారెక్టర్లలో కమల్ హాసన్ విశ్వరూపం చూపించాడు. కమల్ నటన , ఎ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ , శంకర్ స్క్రీన్ ప్లే ఇలా అన్ని కూడా సినిమా విజయం లో కీలక పాత్ర పోషించాయి. విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు..వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. అలాంటి గొప్ప మూవీ కి సీక్వెల్ గా శంకర్ భారతీయుడు 2 ను తెరకెక్కించారు. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా..పలు కారణాల కారణంగా షూటింగ్ ఆగిపోవడం..ఆ తర్వాత రీ షూట్ చేయడం..ఇలా మొత్తానికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి..ఈరోజు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంది..? ఫస్ట్ పార్ట్ ను మించి ఉందా..? కమల్ యాక్టింగ్ ఎలా ఉంది..? శంకర్ స్క్రీన్ ప్లే మెప్పించిందా..? అనిరుద్ మ్యూజిక్ వర్క్ అవుట్ అయ్యిందా..? ఇలాంటివన్నీ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి వారు సినిమా గురించి ఏమంటున్నారో చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆట తో భారతీయుడు 2 సందడి మొదలైంది కానీ విదేశాల్లో అర్ధరాత్రి నుండే షోస్ పడడంతో సినిమా చూసిన అభిమానులు , సినీ లవర్స్ సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు. సినిమాకు ఎక్కువగా నెగిటివ్ టాక్ వస్తుంది. భారతీయుడు తో పోలిస్తే కథ , స్క్రీన్ ప్లే పెద్దగా వర్క్ అవుట్ కాలేదని అంటున్నారు. కమల్ హాసన్ మేకప్ కూడా అంతగా సెట్ అవ్వలేదని , కథలో ఎమోషన్ సీన్లు పెద్దగా పండలేదని చెపుతున్నారు. భారతీయుడు సినిమా కథ చాల బాగుంటుందని , స్క్రీన్ ప్లే కు అద్భుతంగా ఉంటుందని , కానీ భారతీయుడు 2 వచ్చేసరికి ఆ రెండు మిస్ అయ్యాయని చెపుతున్నారు. కమల్ యాక్టింగ్ లో వంక పెట్టాల్సిన అవసరం లేదని , అనిరుద్ మ్యూజిక్ కూడా పర్వాలేదని చెపుతున్నారు. ఫస్ట్ కాస్త పర్వాలేదు..సెకండ్ హాఫ్ ఏమాత్రం బాగాలేదని అంటున్నారు. గ్రాఫిక్స్ పరంగా ఓకే అంటున్నారు. ఈ టాక్ తో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం చరణ్ తో శంకర్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరణ్ ..ఈ సినిమాతో ఎలాంటి విజయం సాదిస్తాడో అని ఉత్కంఠ తో ఉండగా..ఇప్పుడు భారతీయుడు 2 టాక్ నెగిటివ్ గా వస్తుండడం తో వారిలో భయం మొదలైంది. చూద్దాం ఏంజరుగుతుందో …!!

Read Also : Sofa Clean: మీ ఇంట్లో ఉన్న సోఫాను శుభ్రం చేయాలా..? అయితే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే..?

Exit mobile version