Site icon HashtagU Telugu

Bharateeyudu 2 Collections : ‘భారతీయుడు-2’ టాకే కాదు కలెక్షన్స్ కూడా దారుణం

Bharateeyudu 2 Collections

Bharateeyudu 2 Collections

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా టాక్ మాత్రమే కాదు ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే వచ్చి మేకర్స్ కు భారీ షాక్ ఇచ్చాయి.

డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ (Shankar – Kamal Hassan) కలయికలో 1996 లో వచ్చిన ‘భారతీయుడు’ (Bharateeyudu ) ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సేనాపతి , చందు క్యారెక్టర్లలో కమల్ హాసన్ విశ్వరూపం చూపించాడు. కమల్ నటన , ఎ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ , శంకర్ స్క్రీన్ ప్లే ఇలా అన్ని కూడా సినిమా విజయం లో కీలక పాత్ర పోషించాయి. విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు..వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. అలాంటి గొప్ప మూవీ కి సీక్వెల్ గా శంకర్ భారతీయుడు 2 ను తెరకెక్కించారు.

We’re now on WhatsApp. Click to Join.

వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా..పలు కారణాల కారణంగా షూటింగ్ ఆగిపోవడం..ఆ తర్వాత రీ షూట్ చేయడం..ఇలా మొత్తానికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి..ఈరోజు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు , సినీ లవర్స్ కు డైరెక్టర్ శంకర్ భారీ షాక్ ఇచ్చారు. కథ లో దమ్ము లేకపోవడం , స్క్రీన్ ప్లే చెత్తగా ఉండడం, ఇక సాంగ్స్ కూడా పెద్దగా బాగుండకపోవడం తో సినిమా చూసిన వారంతా నిరాశ వ్యక్తం చేసారు.

అసలు శంకర్ రేనా ఈ సినిమా తీసింది అని అంత మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమా టాక్ మాత్రమే కాదు ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా దారుణంగా వచ్చాయి. మొదటిరోజు దేశ వ్యాప్తంగా రూ.28.1 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. తమిళంలో రూ.16 కోట్లు, తెలుగులో రూ.8 కోట్లు వచ్చినట్లు సమాచారం.

Read Also : YS Sharmila : వైసీపీ వాళ్లు నేను చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి – YS షర్మిల