Site icon HashtagU Telugu

Bhakta Kannappa : ఆ దర్శకుడితో మొదలైన కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’.. బాపు-రమణలతో తెరకెక్కింది..

Bhakta Kannappa Movie Back story before Production

Bhakta Kannappa Movie Back story before Production

కృష్ణంరాజు (Krishnam Raju) కెరీర్‌లోనే కాదు తెలుగు పరిశ్రమలో కూడా ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన సినిమా ‘భక్తకన్నప్ప’(Bhakta Kannappa). రౌద్ర పాత్రలు చేస్తూ మాస్ ఇమేజ్ ని అందుకున్న కృష్ణంరాజు ఒక భక్తిరస చిత్రం చేస్తున్నారు అని తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని సందేహ పడ్డారు. అయితే 1976లో రిలీజ్ అయిన ఈ మూవీలోని కృష్ణంరాజు నటన అందరిని కట్టిపడేసింది. కాగా ఈ మూవీని బాపు-రమణ(Bapu Ramana) తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ముందుగా వేరే దర్శకుడితో మొదలైంది.

కృష్ణంరాజు ‘గోపీకృష్ణ మూవీస్’ నిర్మాణ సంస్థను ప్రారంభించి ‘కృష్ణవేణి’ అనే సూపర్ హిట్ సినిమాని నిర్మించాడు. ఈ చిత్రాన్ని మధుసూదనరావు డైరెక్ట్ చేశారు. ఇక రెండో సినిమాగా ఒక పౌరాణిక చిత్రం తియ్యాలని భావించారు. అదే ‘భక్త కన్నప్ప’ ప్రాజెక్ట్. ఇక ఆల్రెడీ తమ సంస్థకి మంచి విజయం అందించిన దర్శకుడు మధుసూదనరావుతో ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు. ఈక్రమంలోనే స్క్రిప్ట్ వర్క్ ని కూడా పూర్తి చేశారు. సంగీత దర్శకులు ఆదినారాయణరావు, సత్యం.. ఈ సినిమా కోసం కొన్ని పాటలను కూడా రికార్డు చేసేశారు.

అయితే ఏమైందో ఏమో మధుసూదనరావు సడన్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో మరో దర్శకుడు కోసం కృష్ణంరాజు వెతకడం మొదలు పెట్టారు. ఆ సమయంలోనే బాపు దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాల ముగ్గు’ సూపర్ హిట్ అయ్యింది. దీంతో కృష్ణంరాజు చూపు బాపు వైపు వెళ్ళింది. ‘భక్తకన్నప్ప’ స్క్రిప్ట్ ని బాపుకి ఇచ్చి ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఆయన కూడా ఒకే అన్నారు. అయితే స్క్రిప్ట్ లో కొన్ని చేంజస్ చేయాలని చెప్పి ముళ్లపూడి వెంకటరమణకు ఆ భాద్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ కి కొన్ని ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసి ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించారు. ఈ మూవీ 90 శాతం షూటింగ్ అవుట్ డోర్ లోనే జరిగింది. బుట్టాయిగూడెం, పట్టిసీమ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ చోటు చేసుకుంది. ఇక సినిమా రిలీజయి భారీ విజయం సాధించింది. ఇన్నాళ్లు కథల్లో చదివిన భక్త కన్నప్ప ని సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించడంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయారు ఈ సినిమాకు. ఈ సినిమాతో కృష్ణం రాజు స్టార్ డమ్ మరింత పెరిగింది.

 

Also Read : Rashmika Mandanna : రష్మిక లైనప్ మాములుగా లేదుగా.. సౌత్, నార్త్ ఊపేస్తోంది..