ప్రస్తుతం టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో బిజీగా ఉన్న వ్యక్తి తమన్ (Thaman). బాలకృష్ణ(Balakrishna)తో వరుసగా బ్లాక్ బస్టర్‌లు అందిస్తూ తన మ్యూజిక్ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నారు. “అఖండ”, “వీరసింహారెడ్డి”, “భగవంత్ కేసరి”, “డాకు మహారాజ్” వంటి విజయవంతమైన చిత్రాలకు తమన్ అందించిన బీజీఎమ్‌లు సినిమాలకు మరో స్థాయి ఇచ్చాయి. ఈ ఇద్దరి కాంబోపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్న వేళ, “అఖండ 2” అనే భారీ ప్రాజెక్ట్ కోసం వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారు. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ సినిమా బీజీఎమ్‌పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.
Tamil Nadu Autonomous : తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. స్టాలిన్ డిమాండ్ అందుకేనా ?
వాస్తవానికి థమన్ 1994లో “భైరవ ద్వీపం” (Bhairava Dweepam) చిత్రంతో డ్రమ్స్ కళాకారుడిగా సినీ రంగ ప్రవేశం చేసాడట. ఈ సినిమాకు సంగీతం అందించిన మాధవపెద్ది సురేష్ వద్ద తమన్ పనిచేయడం మొదలుపెట్టాడు. మొదటి రోజు తనకు కేవలం ముప్పై రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే అందుకున్నాడట. తొమ్మిది రోజుల పాటు పని చేసి మొత్తం 270 రూపాయలు సంపాదించాడు. ఇది చిన్న మొత్తమే అయినప్పటికీ, ఆ రోజుల్లో ఒక యువ కళాకారుడికి పెద్ద ప్రోత్సాహమే. అంతేకాదు తన సినీ కెరీర్‌లో బాలకృష్ణతో మొదటి అనుబంధం కూడా ఇదే సినిమాతో ఏర్పడిందని, అది తనకు ప్రత్యేకమైన మధుర జ్ఞాపకమని తమన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. థమన్ మాటలు విన్న అభిమానులు ఓహ్…అని అనుకుంటున్నారు.