Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ప్రమోషనల్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పంజాబీ స్టైల్‌తో..

ప్రభాస్ 'కల్కి' ప్రమోషనల్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. పంజాబీ పాప్ సింగర్ తో కలిసి ప్రభాస్..

  • Written By:
  • Updated On - June 15, 2024 / 04:14 PM IST

Kalki 2898 AD : అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నాగ్ తెరకెక్కుతున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. సి అశ్విని దత్ దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, పశుపతితో పాటు ఇతర పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ డిఫరెంట్ గా నిర్వహిస్తూ వస్తుంది. ఈక్రమంలోనే ఇండియన్ స్టార్ పాప్ సింగర్ దిల్జిత్ దోశాంజ్ (Diljit Dosanjh) తో ఒక ప్రమోషనల్ సాంగ్ ని పాడించారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కోసం పంజాబీ స్టైల్ లో ఒక సూపర్ సాంగ్ ని కంపోజ్ చేసి దిల్జిత్ పాడించారు.

ఇక ఈ పాటని ప్రభాస్ అండ్ దిల్జిత్ పై చిత్రీకరించారు. ఈ సాంగ్ ప్రోమోని నేడు రిలీజ్ చేసారు. ఫుల్ సాంగ్ ని రేపు రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేసారు. కాగా ఈ ప్రోమోలో ప్రభాస్ అండ్ దిల్జిత్ మాత్రమే కనిపించబోతున్నారా..? లేదా మూవీలోని ఇతర స్టార్స్ దీపికా పదుకోన్, దిశా పటాని, అమితాబ్ కూడా కనిపించనున్నారా..? అనేది తెలియాల్సి ఉంది.

https://youtu.be/gObSiUflyac?list=PLD8J0-dKvBidUYlnyqaCfkGHji8xiT4Bn