Mr Bachchan : మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. గతంలో ఈ ఇద్దరు కాంబినేషన్ లో షాక్, మిరపకాయ సినిమాలు వచ్చాయి. షాక్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటే.. మిరపకాయ ఆడియన్స్ మెప్పు పొంది బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఇక ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’తో మరో హిట్టుని అందుకోవడం కోసం సిద్ధమవుతున్నారు.
గత ఏడాది డిసెంబర్ లో ఈ మూవీని అనౌన్స్ చేసి స్టార్ట్ చేసిన మూవీ టీం.. శరవేగంగా చిత్రీకరణని జరుపుతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజకి జోడిగా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తుంది. ఈ సినిమాతోనే ఈ భామ హీరోయిన్ గా పరిచయమవుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో డబ్బింగ్ చెబుతున్నట్లు ఓ పోస్ట్ వేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన రవితేజ ఫ్యాన్స్.. మిస్టర్ బచ్చన్ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యిపోయాయా..? అంటూ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నారు.
Dubbing for #MrBachchan ??🤔🤔@RaviTeja_offl #RaviTeja #BhagyashreeBorse @harish2you pic.twitter.com/dAJlJfstkA
— kiran RT fan (@kiransa04221490) May 12, 2024
డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయంటే.. ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యినట్లే అని తెలుస్తుంది. దీంతో ఈ మూవీ రిలీజ్ పై రవితేజ ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలయింది. ఇప్పటికే టాలీవుడ్ బడా మూవీస్ అన్ని రిలీజ్ కి డేట్ ని ఫిక్స్ చేసుకొని కూర్చున్నాయి. దీంతో ఈ మూవీ రిలీజ్ కి ఏ డేట్ దొరుకుంటుందో అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి చిత్ర నిర్మాతలు ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి. కాగా ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా వస్తుంది.