“మిస్టర్ బచ్చన్” చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse).. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా సక్సెస్ కానప్పటికీ , ఆమె అందాలు, పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. మాస్ అప్పీల్ కలిగిన పాటల్లో డ్యాన్స్‌లు, గ్లామర్ షో ద్వారా ఈ బ్యూటీ యువతలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. సోషల్ మీడియా వేదికగా భాగ్యశ్రీ షేర్ చేస్తున్న హాట్ ఫొటోలు యువకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
భాగ్యశ్రీ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా మారింది. రామ్ పోతినేనితో ఓ ప్రాజెక్ట్, విజయ్ దేవరకొండతో “కింగ్‌డమ్” అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో నాలుగు సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయంటూ సమాచారం. అంతేకాదు ఈ హాట్ బ్యూటీ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. ఆమె హీరో రామ్‌తో ప్రేమలో ఉందన్న ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Surya : పాపం..13 ఏళ్లుగా హిట్ లేని హీరో..ఎక్కడ మిస్ అవుతున్నాడబ్బా !
ఇటీవల వీరిద్దరూ వేర్వేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఈ ప్రేమ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఆ ఫోటోల్లోని నేపథ్యాలు ఒకేలా ఉండటంతో, వీరిద్దరూ ఒకే చోట ఉన్నారని నెటిజన్లు గుర్తించారు. అంతేకాకుండా, భాగ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా రామ్ చేసిన ప్రత్యేకమైన పోస్ట్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు రావడంతో రామ్ పోతినేని విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టాడు. ఈ సంవత్సరం ప్రేమను,సంతోషాన్ని అందిస్తుంది bb అని రాసుకొచ్చాడు. bb అంటే బేబీ అని అర్థమని, దీంతో వీరు తమ ప్రేమను కన్ఫర్మ్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయంపై రామ్ కానీ, భాగ్యశ్రీ కానీ అధికారికంగా స్పందించలేదు. కానీ వారి అభిమానులు మాత్రం వీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. చూద్దాం మరి నిజంగా వీరు ప్రేమలో ఉన్నారా..? లేక సినిమాకు హైప్ తేవడం కోసం ఇలా ఉంటున్నారా అనేది చూడాలి.