బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ వెంటనే తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ భాగ్య శ్రీ బోర్స్. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ తో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫెయిల్ అయినా భాగ్య శ్రీకి మాత్రం మంచి పాపులారిటీ వచ్చింది. మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) రిలీజ్ అయ్యిందో లేదో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో ఛాన్స్ అందుకుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ తో పాటు భాగ్య శ్రీ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.
ఇప్పుడు అమ్మడి ఖాతాలో మరో లక్కీ ఛాన్స్ వచ్చి చేరింది. భాగ్య శ్రీ (Bhagya Sri) లేటెస్ట్ గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన లక్కీ ఛాన్స్ అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రామ్ (Ram) హీరోగా చేయబోతున్న సినిమాను మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాం సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా లక్కీ ఆఫర్ కొట్టేసింది.
రామ్ లాంటి టైర్ 2 హీరోతో భాగ్య శ్రీ భలే ఆఫర్ కొట్టేసింది. కెరీర్ లో చేసిన ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా అమ్మడు మాత్రం వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఓ పక్క విజయ్ దేవరకొండ సినిమా.. మరోపక్క రామ్ సినిమా ఈ రెండు సినిమాలతో అమ్మడు అదరగొట్టబోతుంది.
టైర్ 2 హీరోలతో వరుస ఛాన్సులు అందుకుంటున్న భాగ్య శ్రీ బోర్స్ నెక్స్ట్ స్టార్ తో నటించాలని అనుకుంటుంది. మరి భాగ్య శ్రీ లక్ ఎలా ఉందో చూడాలి.