Site icon HashtagU Telugu

Bhagwanth Kesari : ‘భగవంత్ కేసరి’ న్యూ పోస్టర్ .. రిలీజ్ డేట్ ఫిక్స్

'bhagwant Kesari' New Poster .. Release Date Fix

'bhagwant Kesari' New Poster .. Release Date Fix

Bhagwanth Kesari : బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా రూపొందుతోంది. బలమైన కథాకథనాలతో సినిమాను సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమా తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న బలమైన ఎమోషన్స్ తో నడుస్తుందని .. బాలయ్య బాబు మార్కు యాక్షన్ ప్రధానంగా నడిచే కథ. బాలకృష్ణ కూతురి పాత్రలో హీరోయిన్ శ్రీలీల అలరించనుంది.

బాలయ్య సరసన హీరోయిన్ పాత్రను కాజల్ పోషించింది. బాలయ్య సరసన నటించడం ఆమెకి ఇదే తొలిసారి. ఈ సినిమా (Bhagwanth Kesari) రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ లో, భారీ గన్స్ తో కనిపిస్తున్న బాలయ్య యాక్షన్ లుక్ అభి మానులకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది🔥

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించారు . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో ప్రియాంక జవాల్కర్ కనిపించనుండగా, ప్రతినాయకుడిగా అర్జున్ రాంపాల్ తొలిసారి తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఈ దసరాకి రిలీజ్ అవుతున్న ఈ సినిమా సంచలనాలకు తెరతీస్తుందని అభిమానులు అంటున్నారు.

Also Read:  T-Congress Leaders : టీ కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే.. లీకైన లిస్ట్