Bhagavanth Kesari నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో అనిల్ రావిపుడి డైరెక్షన్ లో వచ్చిన సినిమా భగవంత్ కేసరి. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లో డిఫరెంట్ మూవీ అని చెప్పుకుంటున్నారు. చాలా తక్కువ టైం లో కమర్షియల్ సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడం జరుగుతుంది. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ పాత్ర ఓ పక్క ఆయన మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తూనే చాలా సెటిల్డ్ గా చేశాడని చెప్పొచ్చు.
సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఒక సినీ జర్నలిస్ట్ అనిల్ రావిపుడి (Anil Ravipudi) సినిమాలో ఒకచోట తప్పుచేశాడని చెప్పారు. సినిమాలో ఒక చిన్న తప్పు ఉందని ఓ పాత్రికేయుడు చెప్పాడు. సినిమాలో జైలర్ శరత్ కుమార్ (Sharath Kumar) చనిపోతే సీఐ చనిపోయాడని అంటూ బ్రేకింగ్ న్యూస్ చూపించారని అంటాడు. ఆ ప్రశ్నని ఊహించని అనిల్ ఆశ్చర్యపోయాడు.
Also Read : Bigg Boss 7 : హౌస్ లో ఆమెకు ఐలవ్యూ అని చెప్పిన తేజ.. మామూలోడు కాదండోయ్..!
మీ పరిశీలనకు, మీ సూక్ష్మ బుద్ధికి హ్యాట్సాఫ్ అన్నారు. కమర్షియల్ సినిమాలో మీరు తప్పుని పట్టుకున్నందుకు నిజంగా గొప్ప విషయమని అన్నారు. అది తప్పేనని కాబట్టి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు అనిల్ రావిపుడి. రాజమౌళి తర్వాత ఓటమి ఎరుగని దర్శకుడిగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు అనిల్ రావిపుడి.
బాలకృష్ణ (Balakrishna)తో రెగ్యులర్ మాస్ సినిమా తీయకుండా ఎమోషనల్ సినిమాతో సూపర్ అనిపించుకున్నాడు. భగవంత్ కేసరి హిట్ పడటంతో అనిల్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు అతనితో సినిమా చేసేందుకు హీరోలు ఆసక్తిగా ఉన్నారు.