చిత్రసీమలో వరుసగా హీరోలు , హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే పలువురు యంగ్ స్టార్స్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు కాగా..వీరి బాటలోనే మరికొంతమంది సిద్ధమయ్యారు. ఈరోజు నాగ చైతన్య – శోభితల వివాహం జరుగగా..ఈ నెల 12 న కీర్తి సురేష్ వివాహం జరగబోతుంది. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు.
అతి త్వరలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయన తండ్రి, ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ వెల్లడించారు. “శ్రీనివాస్‌కు అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు ఫిక్స్ అయిపోయాయి. త్వరలోనే పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తాం” అని సురేశ్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం గురించి ఎప్పటి నుండో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పెళ్లి తరువాత ఆయన కెరీర్‌లో ఒక కొత్త దశ ప్రారంభం కాబోతుందంటూ పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు.
అల్లుడు శీను సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన సాయి శ్రీనివాస్ మొదటి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సాయి శ్రీనివాస్.. ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఛత్రపతి రీమేక్ తో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ చేతిలో నాగులు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భైరవం సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత టైసన్ నాయుడు మూవీతోపాటు మరో రెండు చిత్రాల్లో నటించనున్నాడు.
Read Also : New Honda Amaze: రూ. 8 లక్షలకు కొత్త హోండా అమేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు వచ్చిన ఫీచర్లు ఇవే!