Bellamkonda Record: రికార్డ్స్ బద్దలుకొట్టిన బెల్లకొండ.. కేజీఎఫ్ ను దాటేసిన ‘జయ జానకి నాయక’

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మూవీ జయ జానకి నాయక హిందీ వెర్షన్‌ యూట్యూబ్ లో రికార్డులు తిరుగరాస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Jaya Janaki Nayaka

Jaya Janaki Nayaka

బోయపాటి సినిమాలు అంటేనే మాస్ కు కేరాఫ్ అడ్రస్. మాస్ అంశాలను టచ్ చేస్తూ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంతో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన డైరెక్షన్ లో స్టార్ హీరోలు, కుర్ర హీరోలు సైతం నటించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మూవీ జయ జానకి నాయక హిందీ వెర్షన్‌ యూట్యూబ్ లో రికార్డులు తిరుగరాస్తోంది.

యూట్యూబ్‌లో 709 మిలియన్ల వ్యూస్ సాధించిన చిత్రంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ క్రమంలో 702 మిలియన్ల వీక్షణలు సాధించిన KGF అధిగమించడం విశేషం. జయ జానకి నాయక హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిందనే వార్త ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. బెల్లంకొండ అభిమానులు ఈ సక్సెస్ ను సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగులో ఈ మూవీ నిరాశపర్చినా.. యూట్యూబ్ లో రికార్డులు నెలకొల్పడం బెల్లంకొండకు బాగా కలిసి వచ్చింది.

జయ జానకి నాయక అనేది బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఇది 2017లో విడుదలైంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, మరియు ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. జయ జానకి నాయక హిందీ వెర్షన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పడంతో బాలీవుడ్ ద్రుష్టి మరోసారి టాలీవుడ్ పై పడింది. మరి ఈ సినిమా కొత్త పుంతలు తొక్కుతుందా, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: Tollywood War: టాలీవుడ్ లో వర్గ పోరు.. చెర్రీ బర్త్ డే వేడుకలకు బన్నీ, ఎన్టీఆర్ డుమ్మా!.

  Last Updated: 29 Mar 2023, 02:21 PM IST