Mahesh Babu: జక్కన్నతో కంటే అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. లుక్ మాములుగా లేదుగా?

  • Written By:
  • Updated On - March 9, 2024 / 11:02 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలె గుంటూరు కారం సినిమాతో ఒక ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మిక్స్డ్ టాక్ ని అందుకున్న మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కిస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మహేష్ కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని అంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమా కంటే ముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారని తెలుస్తోంది. ఏంటి అని షాక్ అవుతున్నారా.. మీరు విన్నది నిజమే గతంలో మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్, డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి వర్క్ చేయనున్నారు. అయితే ఈసారి సినిమా కోసం కాదు మహేష్ బాబుతో అనిల్ రావిపూడి ఒక యాడ్ చేస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మహేష్ బాబు తన లేటెస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే అందరూ ఈ లుక్ రాజమౌళి సినిమా కోసం అని అనుకున్నారు కానీ ఇది అనిల్ రావిపూడి యాడ్ షూట్ కోసం అని క్లారిటీ వచ్చేసింది. అనిల్ కూడా సోషల్ మీడియాలో మహేష్ బాబుతో యాడ్ షూట్ చేస్తున్నా అని పోస్ట్ షేర్ చేశారు. ఇక తాజాగా మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోలు అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడు మహేష్. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోని చూసిన అభిమానులు వయసు పెరుగుతున్న కూడా మహేష్ బాబు అందం ఏ మాత్రం తగ్గడం లేదు అని కొందరు కామెంట్ చేయగా మరికొందరు వయసుతోపాటు అందం కూడా మరింత పెరుగుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.