Site icon HashtagU Telugu

Bheems : భీమ్స్ మ్యూజిక్ ఇవ్వడం లేదా..? అదేంటి..?

Bheems

Bheems

శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’ (Bhogi) ఇప్పటికే టైటిల్, ఫస్ట్ స్పార్క్ వీడియోతో మంచి అంచనాలను ఏర్పరిచింది. అయితే ఈ సినిమాలో పని చేస్తున్న టెక్నిషియన్లకు సంబంధించిన కొన్ని అంశాల్లో స్పష్టత లేకపోవడం సినీ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అనుమానాలు మిగిలిపోతున్నాయి. మొదట ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్ (Bheems ) సిసిరోలియాను ప్రకటించినప్పటికీ, తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన పేరును ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజున ఎంత బంగారం కొన్నారంటే?

భీమ్స్ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. రచయితగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, 2012లో సంగీత దర్శకుడిగా మారి మంచి విజయాలు అందుకుంటూ వస్తున్నారు. ప్రత్యేకంగా సంపత్ నందితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అయితే ప్రస్తుతం ‘భోగి’ ప్రాజెక్టులో ఆయన ఉండటం లేదా అన్నదానిపై కన్ఫర్మేషన్ లేకపోవడం గమనార్హం. ఫస్ట్ ప్రెస్ మీట్‌లో పేరుంటే, రెండవ ప్రకటనలో లేకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు మాట్లాడుకునేలా చేసింది.ఈ సినిమా నుంచి భీమ్స్ తప్పుకున్నారా? లేక యూనిట్ ఆయనను తొలగించిందా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version