Site icon HashtagU Telugu

Bedurulanka 2012 Premier Talk : బెదురులంక 2012 టాక్

Bedurulanka 2012 is now streaming on OTT

Bedurulanka 2012 is now streaming on OTT

RX100 మూవీ తో యూత్ ను ఆకట్టుకున్న కార్తికేయ (Kartikeya) నుండి వస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012 (Bedurulanka 2012). 2012లో యుగాంతం కాన్సెప్ట్‌తో విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ మూవీ తెరకెక్కింది. సి. యువరాజ్ సమర్పణలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటీకే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , ప్రమోషన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసాయి.

RX100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తికేయ..ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు కానీ మొదటి సినిమా రేంజ్ లో మాత్రం హిట్ కొట్టలేకపోయాడు. ఆ మధ్య విలన్ గా కూడా ట్రై చేసాడు. నాని , అజిత్ మూవీస్ లలో విలన్ రోల్ చేసినప్పటికీ అవికూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బెదురులంక 2012 మూవీ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని చెపుతూ వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? కార్తికేయ ఖాతాలో హిట్ పడ్డట్లేనా..? లేదా ..? అనేది ప్రీమియర్ షో టాక్ (Bedurulanka 2012 Premier Show) ద్వారా తెలుసుకుందాం.

సినిమా ఫై ఉన్న నమ్మకంతో ఓ రేంజ్ ముందే ఈ చిత్రాన్ని (Bedurulanka 2012 ) తెలంగాణ, ఏపీలో స్పెషల్ ప్రీమియర్స్ వేశారు.హైదరాబాద్‌, వైజాగ్, కాకినాడ, గుంటూరు, విజయవాడతోపాటు పలు పట్టణాల్లో ఐదు పెయిడ్‌ షోలు వేయడం జరిగింది. ఈ సినిమా చూసిన అభిమానులు , సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ సినిమా చాల బాగుందని చెపుతున్నారు. కామెడీ, ఎమోషన్ తో పాటు స్టోరీ టెల్లింగ్ ఉందని అంటున్నారు.

Read Also :  King Of Kotha : దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ ఎలా ఉందంటే..

ముఖ్యంగా కార్తికేయ , నేహా శెట్టి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని , సినిమాకు అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యర్, కసిరెడ్డి పాత్రలు హైలెట్ గా నిలిచాయని చెపుతున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుందని , క్లైమాక్స్ కి 45 నిమిషాల ముందు నుండి సినిమా ఉపందుకుందని అంటున్నారు. దర్శకుడు అనుకున్న కథను మెప్పించేలా చెప్పడంలో సక్సెస్ అయ్యాడని చెపుతున్నారు. ఓవరాల్ గా ప్రీమియర్ షో ద్వారా అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది..రేపు థియేటర్స్ నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.