ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఎంట్రీ తోనే అదరగొట్టిన కృతి శెట్టి ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేదు. దానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ కృతి శెట్టి కెరీర్ పరంగా ఏడెనిమిది సినిమాలు చేసిందో లేదో అలా వెనకపడిపోయింది. తెలుగులో చివరగా ఈ సమ్మర్ లో మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది కూడా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు. తెలుగులో మళ్లీ స్ట్రాన్ కెరీర్ కోసం ఎదురుచూస్తున్న కృతి శెట్టి ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో రకరకాల ఫోటో షూట్స్ చేస్తుంది.
బేబమ్మ ముద్దు ముద్దుగా చేస్తున్న ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో ఆమెపై అటెన్షన్ ఏర్పడేలా చేస్తున్నాయి. తెలుగులో పెద్దగా ఛాన్సులు లేని కృతి శెట్టి తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటాలని చూస్తుంది. కోలీవుడ్ (Kollywood) లో రెండు సినిమాలు చేస్తున్న కృతి శెట్టి (Krithi Shetty) మలయాళంలో టోవినో థామస్ తో జత కడుతుంది. ఈ రెండు సినిమాలతో మళ్లీ లైం లైట్ లోకి రావాలని చూస్తుంది.
ఐతే ఈమధ్య ఫోటో షూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన బేబమ్మ లేటెస్ట్ గా గ్రీన్ కలర్ శారీలో అందాలను గుమ్మరిస్తుంది. కట్టింద్ శారీనే అయినా కృతి శెట్టి చూపులతోనే కుర్రాళ్లు తెగ డిస్ట్రబ్ అవుతున్నారు. తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్న కృతి శెట్టి ఇక మీదట గ్లామర్ రోల్స్ కి కూడా సై అనేస్తుందని అంటున్నారు. దానికి హింట్ ఇస్తూనే రకరకాల ఫోటో షూట్స్ చేస్తుందని చెబుతున్నారు.
కృతి శెట్టి ప్రతి ఫోటో షూట్ సోషల్ మీడియాలో డిస్కషన్స్ ఏర్పడేలా చేస్తుంది. ఉప్పెన (Uppena) లాంటి మరో బ్లాక్ బస్టర్ సినిమా పడితే గానీ కృతి శెట్టి తిరిగి ఫాం లోకి వచ్చే ఛాన్స్ లేదు. మరి అమ్మడికి అలాంటి సినిమా ఏది అవుతుందో చూడాలి.
Also Read : Double Ismart : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్..!